Side effects of Vitamin D: విటమిన్ డి అధికంగా తీసుకుంటే శరీరంలో వచ్చే వ్యాధులివే.. ఇప్పుడే తెలుసుకోండి..

|

Jul 09, 2022 | 12:06 PM

Side effects of Vitamin D: విటమిన్ డి శరీరానికి చాలా అవసరం. అయితే, దానిని అధిక మోతాదులో తీసుకుంటే వ్యాధుల బారిన పడటం ఖాయం.

Side effects of Vitamin D: విటమిన్ డి అధికంగా తీసుకుంటే శరీరంలో వచ్చే వ్యాధులివే.. ఇప్పుడే తెలుసుకోండి..
Vitamin D
Follow us on

Side effects of Vitamin D: విటమిన్ డి శరీరానికి చాలా అవసరం. అయితే, దానిని అధిక మోతాదులో తీసుకుంటే వ్యాధుల బారిన పడటం ఖాయం. అయితే, డి విటమిన్ లోపం వలన కూడా అనేక సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఆ సమస్యలను కవర్ చేయడానికి సప్లిమెంట్స్ తీసుకుంటారు. డి విటమిన్ తీసుకోవడం కలిగే నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వికారం, వాంతులు: సప్లిమెంట్ల రూపంలో విటమిన్ డి ఎక్కువగా తీసుకోకూడదు. అలా తీసుకుంటే.. వికారం, వాంతులు సమస్య మొదలవుతుంది. డాక్టర్, నిపుణుడి సలహా ప్రకారమే తీసుకోవాలి.

మానసిక మస్యలు: అనారోగ్యం: ఏదైనా ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల చాలా నష్టం వాటిల్లుతుందనేది నిజం మరియు విటమిన్ డి విషయంలో కూడా అంతే. మీరు పరిమితికి మించి విటమిన్ డి తీసుకుంటే, ఈ స్థితిలో మీరు మానసిక వ్యాధులను ఎదుర్కోవలసి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఆకలి లేకపోవడం: విటమిన్ డి తీసుకోవడంలో తప్పుడు పద్ధతులు అవలంభించడం వలన ఆకలి తగ్గిపోతుంది. మరీ అవసరమైతే తప్ప సప్లిమెంట్స్ తీసుకోకూడదని వైద్యులు సూచిస్తున్నారు. బదులుగా సూర్యకాంతి ద్వారా విటమిన్ డి లోపాన్ని అధిగమించవచ్చు. ఉదయం వేళ కాసేపు ఎండలో నడవడం, కూర్చుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు.

మలబద్ధకం: విటమిన్ డి కోసం తయారు చేయబడిన సప్లిమెంట్లు, దాని మూలాలను కలిగి ఉన్న ఆహారాలను అధికంగా తీసుకోవడం వలన మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..