Corona Test: గడిచిన రెండేళ్లుగా కరోనా మహమ్మారి యావత ప్రపంచ జనాభాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మాయదారి కరోనా.. ఎక్కడి వస్తుందో, ఎలా వ్యాపిస్తుందో తెలియక బిక్కు బిక్కుమంటూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ రూపంలో విజృంభించిన కరోనా.. థర్డ్ వేవ్‌లో ఒమిక్రాన్ రూపంలో ప్రపంచాన్ని గడగడలాడించింది. గత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జనాలు హడలిపోయారు. సెకండ్ వేవ్ సమయంలో కరోనా కేసుల భారీగా పెరగడం, ఆస్పత్రుల్లో వసతులు లేకపోవడంతో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ, సెకండ్ వేవ్‌కి, థర్డ్ వేవ్‌కి పరిస్థితులు మారిపోయాయి. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని వైద్య సదుపాయాలను అందులోకి తీసుకువచ్చాయి ప్రభుత్వాలు. ఆ క్రమంలోనే కరోనా టెస్టుల కోసం ఆస్పత్రులకు పరుగులు పెట్టకుండా ఉండేందుకు.. ఇంట్లోనే టెస్టులు చేసుకునేందుకు వీలుగా ర్యాపిడ్ టెస్ట్ కిట్‌లు వచ్చాయి. తొలుత కొంత తక్కువ ఉత్పత్తి అయినా.. ఇప్పుడు మార్కెట్‌లో విరివిగా దొరుకుతున్నాయి.
తాజాగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మధ్య చాలా మంది ర్యాపిడ్ టెస్ట్ కిట్‌లతో ఇంట్లోనే కొవిడ్ పరీక్షలు చేస్తున్నారు. అయితే, సెల్ఫ్ కరోనా టెస్టులు చేసుకునేందు ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా మనకు కరోనా సోకిన కనీసం రెండు రోజుల తర్వాత గానీ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు వైరస్‌ను గుర్తించవు. కనీసం మూడు రోజుల తర్వాత చేస్తే ఫలితం కరెక్ట్‌గా వస్తుంది. మరి వైద్యులు చేసిన ఆ సూచనలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Also read:
IPL 2022 Auction: కేకేఆర్ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా.. వేలంలో ఈ 5గురు సొంతమయ్యేనా?