Mosquito Control: మలేరియా దోమలపై బ్రహ్మాస్త్రం..ఇది ప్రయోగిస్తే దోమలు పరార్!

|

Aug 03, 2021 | 5:02 PM

ప్రపంచవ్యాప్తంగా మలేరియా కారణంగా ప్రతి సంవత్సరం లక్షల మంది మరణిస్తున్నారు. ఈ మరణాలను తగ్గించడానికి, మలేరియా కేసులను తగ్గించడానికి శాస్త్రవేత్తలు కొత్త ప్రయోగం చేశారు.

Mosquito Control: మలేరియా దోమలపై బ్రహ్మాస్త్రం..ఇది ప్రయోగిస్తే దోమలు పరార్!
Mosquito Control
Follow us on

Mosquito Control: ప్రపంచవ్యాప్తంగా మలేరియా కారణంగా ప్రతి సంవత్సరం లక్షల మంది మరణిస్తున్నారు. ఈ మరణాలను తగ్గించడానికి, మలేరియా కేసులను తగ్గించడానికి శాస్త్రవేత్తలు కొత్త ప్రయోగం చేశారు. దోమల జనాభాను నియంత్రించడానికి సీఆర్ఐఎస్పీఆర్ (CRISPR) జన్యు సవరణ పద్ధతులను ఉపయోగించి శాస్త్రవేత్తలు మలేరియాను వ్యాప్తిచేసే ఆడ దోమలను వంధ్యత్వానికి గురి చేస్తున్నారు. శాస్త్రవేత్తలు  ఈ టెక్నిక్ గేమ్ ఛేంజర్‌గా నిరూపితమవుతుందని..ఇది ప్రాణాంతక వ్యాధిని పూర్తిగా నిర్మూలిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు.  లండన్లోని ఇంపీరియల్ కాలేజ్, లివర్‌పూల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ సంయుక్తంగా దీనిపై పరిశోధనలు చేస్తున్నాయి. మొట్టమొదటిసారిగా, శాస్త్రవేత్తలు ఆడ దోమల జన్యువులను పునరుత్పత్తి చేయలేనట్లుగా మార్చారు. దీని కోసం, శాస్త్రవేత్తలు అనాఫిలిస్ గాంబీ జాతి దోమలను ఎంచుకున్నారు. ఉప-సహారా ఆఫ్రికాలో మలేరియా వ్యాప్తికి ఈ జాతి దోమలే కారణంగా ఉంటున్నాయి.

ఆడ దోమలను సంతానలేమి చేయడం..

  • శాస్త్రవేత్తలు సీఆర్ఐఎస్పీఆర్ (CRISPR) జన్యు సవరణ సాంకేతికతను ఉపయోగించి ఆడ దోమలకు  వంధ్యత్వం కలిగిస్తున్నారు. ఈ టెక్నిక్ సహాయంతో, శాస్త్రవేత్తలు మార్చాలనుకుంటున్న జన్యువులో మార్పులు చేయవచ్చు.
  • మలేరియా విషయంలో, ఆడ దోమలో ఉన్న డబుల్‌సెక్స్ జన్యువు సవరించారు. దీనివలన అది పునరుత్పత్తికి ఉపయోగపడదు. ఈ విషయంపై చేసిన ప్రయోగంలో, 560 రోజులలోపు దోమల సంఖ్య తగ్గింది.
  • దోమతెరలు, పురుగుమందులు, టీకాలతో జన్యు సవరణ మలేరియాను తొలగించడానికి వేగవంతమైన టెక్నిక్ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది పెద్ద వ్యత్యాసాన్ని చూపిస్తుందని వారు నమ్ముతున్నారు.

3500 కంటే ఎక్కువ జాతులు..

కొన్ని రకాల దోమలు మాత్రమే మలేరియాను వ్యాపిస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 3500 కంటే ఎక్కువ రకాల దోమలు ఉన్నాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే మలేరియా వ్యాప్తి చేస్తున్నాయి.  ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం, 2019 లో ప్రపంచవ్యాప్తంగా 230 మిలియన్ల మలేరియా కేసులు నమోదయ్యాయి. 4 లక్షల మందికి పైగా మరణించారు. ఈ మరణాలలో చాలా వరకు 5 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారు.

70 సంవత్సరాల సుదీర్ఘ ప్రయత్నాల తర్వాత మలేరియా నుంచి చైనాకు విముక్తి..

70 సంవత్సరాల నిరంతర ప్రయత్నాల తరువాత, చైనా ఇటీవల మలేరియా రహితంగా మారింది.  డబ్ల్యూహెచ్‌ఓ(WHO) దీనిని ప్రకటించింది. గతంలో చైనాలో ప్రతి సంవత్సరం 30 మిలియన్ల మలేరియా కేసులు నమోదయ్యేవి. పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో  ఈవిధంగా మలేరియా రహితంగా మారిన దేశాల్లో  చైనా మొదటి దేశం. గత 4 సంవత్సరాలలో ఒక్క మలేరియా కేసు కూడా ఇక్కడ నమోదు కాలేదు.

చైనీస్ వ్యూహం..

చైనా 2012 లో 1-3-7 వ్యూహాన్ని అమలు చేసింది. ఆరోగ్య కార్యకర్తలకు లక్ష్యాలు నిర్దేశించారు. వ్యూహం ప్రకారం, మలేరియా కేసును 1 రోజులోపు నివేదించడం తప్పనిసరి చేశారు. ఈ అంశంపై 3 రోజుల్లో విచారణ జరిపి, దాని నుండి ప్రమాదాన్ని తెలుసుకోవడం అవసరం. అదే సమయంలో, ఈ కేసు వ్యాప్తిని 7 రోజుల్లో నిరోధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కచ్చితంగా సూచనలు ఇచ్చారు. క్షేత్రస్థాయిలో  అన్ని నిబంధనలనూ తప్పనిసరిగా అమలు చేసేలా చూశారు.

Also Read: Weight Loss : బరువు తగ్గడానికి చిన్నప్పటి గేమ్ సూపర్‌గా పనిచేస్తుంది..! కేలరీలు వేగంగా బర్న్ అవుతాయి..

Corona 3rd Wave: పెరుగుతున్న కరోనా పునరుత్పత్తి మూడో వేవ్‌కు సంకేతమా? అసలు పునరుత్పత్తి రేటు అంటే ఎమిటి?  పూర్తి వివరాలు..