Health: రక్తంలో చక్కెర, ఆల్కహాల్‌ స్థాయిలని పరిశీలించడానికి మరొక కొత్త పరికరం..!

|

May 23, 2022 | 3:17 PM

Health: యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ డియాగోకు చెందిన ఇంజనీర్లు రక్తంలో చక్కెర, ఆల్కహాల్‌ స్థాయిలని పరిశీలించడానికి "లాబ్ ఆన్ ఎ స్కిన్" సెన్సార్‌ కనుగొన్నారు.

Health: రక్తంలో చక్కెర, ఆల్కహాల్‌ స్థాయిలని పరిశీలించడానికి మరొక కొత్త పరికరం..!
Multi Tasking Wearable
Follow us on

Health: యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ డియాగోకు చెందిన ఇంజనీర్లు రక్తంలో చక్కెర, ఆల్కహాల్‌ స్థాయిలని పరిశీలించడానికి “లాబ్ ఆన్ ఎ స్కిన్” (Lab on a skin) సెన్సార్‌ కనుగొన్నారు. ఇది డయాబెటీస్‌ పేషెంట్లకు చాలా ఉపయోగపడుతుంది. ఇది ఒక్కసారి ధరిస్తే రక్తంలో చక్కెర స్థాయిలని ట్రాక్‌ చేసి అలర్ట్‌ చేస్తుంది. వ్యాయామం చేసేటప్పుడు, డ్రింక్స్ తాగేటప్పుడు రక్తంలో చక్కెర పెరగడం, తగ్గడాన్ని నిరోధించగలదు. స్పష్టమైన నిరంతర బ్లడ్ షుగర్ మానిటరింగ్‌తో పాటు, ఆల్కహాల్ స్థాయిలను గుర్తించి నివేదించగలదు. అది వారి జీవన నాణ్యతను పెంచుతుంది. ఈ పరికరాన్ని ధరించడం వల్ల ఎటువంటి బాధ కూడా ఉండదు.

ఈ పరికరం ఆల్కహాల్ స్థాయిలను కూడా పర్యవేక్షిస్తుంది. ఎందుకంటే ఆల్కహాల్ తాగడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. డయాబెటీస్‌ పేషెంట్లు ఈ రెండు స్థాయిలని గమనించడం చాలా ముఖ్యం. మధుమేహం ఉన్న వ్యక్తులు ఏదైనా పానీయం తీసుకున్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోకుండా నిరోధించడంలో ఈ పరికరం సహాయపడుతుంది. వ్యాయామం సమయంలో లాక్టేట్ గురించి సమాచారాన్ని అందిస్తుంది. ఎందుకంటే వ్యాయామం అనేది శరీర సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది.ఈ పరికరం సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీ ఫోన్‌కి అందిస్తూ అలర్ట్‌ చేస్తుంటుంది. పరిశోధకులు దీనితో ఖచ్చితత్వ ఫలితాలను సాధించారు.

ఇవి కూడా చదవండి

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి