Rosemary Oil: జట్టు పెరగడం లేదని చింతిస్తున్నారా..? ఈ టిప్స్ పాటిస్తే మంచి ఫలితం

|

Oct 04, 2021 | 1:06 PM

రోజ్మేరీ ఆయిల్ జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. మీరు రోజ్మేరీ హెయిర్ ఆయిల్‌ను ఉపయోగించి జుట్టు రాలడం సమస్యను తొలగించుకోవడంతో పాటు జుట్టును వేగంగా పెంచుకోవచ్చు.

Rosemary Oil: జట్టు పెరగడం లేదని చింతిస్తున్నారా..?  ఈ టిప్స్ పాటిస్తే మంచి ఫలితం
Rosemary Oil
Follow us on

Rosemary Oil: రోజ్మేరీ ఒక మూలిక. ఇది అనేక విదేశీ వంటకాల రుచిని పెంచడానికి ఉపయోగిస్తుంటారు. అలాగే రోజ్మేరీ నూనెను అరోమాథెరపీకి కూడా ఉపయోగిస్తారు. ఇది జుట్టుకు బాగా పనిచేస్తుంది. జుట్టు పెరుగుదలకు ఎంతో సహాయపడుతుంది. ఈ నూనె జుట్టు రాలడం కూడా తగ్గించగలదు. జుట్టుకు సంబంధించిన ప్రతీ సమస్యను తొలగించడానికి మీరు ఈ నూనెను నిర్భయంగా ఉపయోగించవచ్చు. జుట్టు పెరుగుదలకు రోజ్మేరీ నూనెను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

4 విధాలుగా రోజ్మేరీ ఆయిల్ ఉపయోగించుకోవచ్చు..

షాంపూకి రోజ్మేరీ ఆయిల్‌ను జోడించండి
మీ సాధారణ షాంపూతో పాటు దీనిని కలిపి వాడాలి. షాంపూకు 5-6 చుక్కల రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ జోడించండి. బాగా మిక్స్ చేసి జుట్టు, తలపై కొన్ని నిమిషాలు మెత్తగా మసాజ్ చేయండి. 5-8 నిమిషాలు అలాగే ఉంచండి. సాధారణ నీటితో బాగా కడిగండి. వారానికి 2-3 సార్లు ఈ విధానాన్ని అనుసరించండి. జుట్టు పెరుగుదలకు రోజ్మేరీ నూనెను ఉపయోగించడానికి ఇది సులభమైన మార్గం.

రోజ్మేరీ నూనెతో జుట్టును శుభ్రం చేయడం..
ఒక కప్పు నీటిలో 6-8 చుక్కల రోజ్మేరీ నూనెను కలపండి. దాన్ని పక్కన పెట్టండి. మీ జుట్టును ఎప్పటిలాగే షాంపూ చేసి, కడిగి, ఆపై టవల్ తో జుట్టును నీళ్లు లేకుండా బాగా తుడవాలి. చివరగా రోజ్మేరీ నీటితో జుట్టును కడగాలి. దీని తర్వాత జుట్టును నీటితో శుభ్రం చేయాల్సిన పనిచలేదు. మీరు ఈ ప్రక్రియను వారానికి రెండు లేదా మూడు సార్లు చేసుకోచ్చు.

రోజ్మేరీ ఆయిల్‌తో ఆలివ్ ఆయిల్‌ను కలిపి..
ఒక గిన్నెలో 2-3 టేబుల్ స్పూన్ల కోల్డ్ ప్రెస్డ్ ఆలివ్ ఆయిల్ తీసుకోండి. దానికి 4-5 చుక్కల రోజ్మేరీ నూనె జోడించండి. బాగా కలిపి ఆ మిశ్రమాన్ని మీ తలకు మసాజ్ చేయండి. ఆ తరువాత ఒక టవల్ ను గోరువెచ్చని నీటిలో నానబెట్టండి. ఈ వెచ్చని టవల్‌తో మీ జుట్టును కవర్ చేసి 40-60 నిమిషాలు అలాగే ఉంచండి. అనంతరం మీ జుట్టును షాంపూని ఉపయోగించి శుభ్రం చేయండి. జుట్టు పెరగడానికి వారానికి 2 లేదా 3 సార్లు ఇలా చేస్తే చాలా మంచింది.

రోజ్మేరీ ఆయిల్‌తో కలబంద..
2-3 టేబుల్ స్పూన్ కలబంద జెల్‌ను ఒక గిన్నెలో తీసుకొని, అందులో 4-6 చుక్కల రోజ్మేరీ నూనె కలపండి. ఈ మిశ్రమాన్ని నెత్తిమీద, వెంట్రుకలకు పూయండి. చేతివేళ్లతో మెత్తగా మసాజ్ చేయండి. తేలికపాటి షాంపూతో శుభ్రం చేయడానికి ముందు దానిని 30-40 నిమిషాల పాటు అలాగే ఉంచండి. వారానికి 2 లేదా 3 సార్లు ఇలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.

Also Read: Skipping: స్కిప్పింగ్ చేస్తే కండరాల బలం.. గుండె ఆరోగ్యం మీ సొంతం.. ఇదెలా చేయాలంటే..

Obesity: ఊబకాయానికి తిండి ఒక్కటే కారణం కాదు.. మరో ముఖ్య కారణమూ ఉందంటున్న శాస్త్రవేత్తలు.. ఏమిటంటే..