మీరు లైంగిక సమస్యలతో బాధపడుతున్నారా? మీ జీవితభాగస్వామిని సంతృప్తిపర్చలేకపోతున్నామని ఫీలవుతున్నారా? వైద్యం కోసం మమ్మల్ని సంప్రదించండి అంటూ ఇచ్చే ప్రకటనలకు మనం చూస్తూనే ఉంటాం. అయితే లైంగిక సమస్యలతో బాధపడేవారు వారి జీవన శైలిలో మార్పులు చేసుకుంటే వైద్యం కంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
స్త్రీలకు సంతానోత్పత్తి ఇవ్వడం కోసం మగవాళ్లు కచ్చితంగా లైంగిక విషయంలో ధృఢంగా ఉండాలి. కొంత మంది సెక్స్ విషయంలో మానసికంగా కుంగిపోతారు కానీ..అలా అవ్వడానికి ప్రధాన కారణలను పట్టించుకోరు. ఇది ఒత్తిడి, నిరాశ, మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలక కారణమవుతుంది. ఇది క్రమేపి కిడ్నీ సమస్యలు క్యాన్సర్ కు కారకాలుగా మారతాయి. అయితే పురుషుల్లో లైంగిక రుగ్మతలకు దారితీసే అనారోగ్య అలవాట్లు ఏంటో తెలుసుకుందాం.
అధికంగా ఉప్పు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల బీపీలో హెచ్చుతగ్గులు వస్తాయి. ఇది లిబిడో సమస్యకు ప్రధాన కారణంగా నిలుస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే సోడియం లెవెల్స్ ఎక్కువుగా ఉండే ప్యాకెజ్డ్ ఫుడ్ ఐటమ్స్ కు కూడా దూరంగా ఉండాలని చెబుతున్నారు.
అన్ని ఆరోగ్య సమస్యలకు స్ట్రెస్ అనేది ప్రధాన కారణంగా నిలుస్తుంది. లైంగిక సమస్యల విషయంలో కూడా స్ట్రెస్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి సెక్స్ సమస్యలు ఉన్న వారు ఏ విషయంలోనైనా అధిక స్ట్రెస్ తీసుకోకుండా ఉండడం ఉత్తమం
శృంగారానికి ముందు ఫోర్ ప్లే అనేది ముఖ్యమని లైంగిక నిపుణుల మాట. కానీ కొంతమంది పురుషులు లైంగిక కు ముందు దాన్ని జోడించరు. ఇది కూడా లైంగిక రుగ్మతలకు కారణంగా నిలుస్తుంది.
మద్యపానం, ధూమపానం వల్ల లైంగిక సమస్యలు అధికమవుతాయి. పొగాకు రక్తప్రవాహానికి ఆటంకం కలిగించడంతో లైంగిక సమస్యలకు కారణమవుతుంది. అలాగే మద్యపానం చేసే వారు లైంగిక పెర్ఫార్మెన్స్ విషయంలో ఇబ్బందిపడతారని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అలాగే ఊబకాయం, అధిక బరువు సమస్యలతో బాధపడేవారు కూడా లైంగిక రుగ్మతలకు గురవుతారు. ముఖ్యంగా అంగస్తంభన సమస్యకు గురవుతారని లైంగిక నిపుణులు పేర్కొంటున్నారు.
లైంగిక ఆరోగ్యాన్ని పెంచేందుకు మార్గాలు
లైంగిక ఆరోగ్యం అనేది మానసిక ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. కాబట్టి లైంగిక విషయాన్ని తరచూ భాగస్వామితో చర్చించడం వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది.
కొన్ని హెల్త్ రిపోర్ట్ ప్రకారం బీపీ, షుగర్ ఉన్నవారి నరాలు దెబ్బతింటాయి. అలాగే అంగానికి రక్తప్రసరణలో ఆటంకం ఏర్పడుతుంది. సో ఇలాంటి వారు ప్రతిరోజూ వ్యాయామం, మెడిటేషన్ వంటి చేస్తే అద్భుత ఫలితాలు పొందుతారని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.