Patanjali Research: ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్‌లో మైక్రోఆర్‌ఎన్‌ఏ పాత్ర ఏంటి? పతంజలి పరిశోధనలో కీలక అంశాలు

Patanjali Research: టీఎన్బీసీ (TNBC)ని నివారించడంలో మైక్రోఆర్ఎన్ఏలు సహాయపడతాయని పరిశోధన స్పష్టం చేసింది. అయితే దీనికి కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. TNBCలో మైక్రోఆర్ఎన్ఏల పాత్రను అర్థం చేసుకోవడానికి, వాటి చికిత్సా, రోగనిర్ధారణ సామర్థ్యాన్ని వెలికితీసేందుకు మరింత పరిశోధన అవసరం. దీని నుండి..

Patanjali Research: ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్‌లో మైక్రోఆర్‌ఎన్‌ఏ పాత్ర ఏంటి? పతంజలి పరిశోధనలో కీలక అంశాలు

Updated on: Apr 25, 2025 | 4:12 PM

ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ (TNBC) అనేది రొమ్ములో సంభవించే ప్రమాదకరమైన క్యాన్సర్. ఈ క్యాన్సర్ ఒక అవయవం నుండి మరొక అవయవానికి వేగంగా వ్యాపిస్తుంది. దానిని నియంత్రించడం అంత సులభం కాదు. ఈ క్యాన్సర్ పై మైక్రోఆర్ఎన్ఏ పాత్రపై పతంజలి పరిశోధనా సంస్థ పరిశోధన చేసింది. TNBC లో మెటాస్టాసిస్‌ను ప్రోత్సహించడంలో లేదా నివారించడంలో మైక్రోఆర్‌ఎన్‌ఏలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని సూచించింది. కొన్ని మైక్రోఆర్ఎన్ఏలు క్యాన్సర్ కణితులపై అణచివేతలుగా పనిచేస్తాయి. అలాగే అవి పెరగకుండా నిరోధించడంలో సహాయపడతాయి.

మైక్రోఆర్ఎన్ఏ ఆధారిత చికిత్సలను అభివృద్ధి చేయడానికి, ప్రభావవంతమైన పద్ధతులు అవసరమని పరిశోధనలో తేలింది. నానోపార్టికల్ ఆధారిత సాంకేతికతను ఉపయోగించి మైక్రోఆర్ఎన్ఏలను లక్ష్యంగా చేసుకుని వాటిని టిఎన్బిసి కణాలకు అందించవచ్చు. ఇది దాని వృద్ధి రేటును తగ్గించగలదు.

ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏమిటి?

ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఈస్ట్రోజెన్ గ్రాహకాలు. ప్రొజెస్టెరాన్ గ్రాహకాలు, HER2 గ్రాహకాలు లేని రొమ్ము క్యాన్సర్. ఈ క్యాన్సర్ సాధారణ క్యాన్సర్ల కంటే అధిక హిస్టోలాజికల్ గ్రేడ్, పునరావృతమయ్యే ప్రమాదం, మరణాల రేటు ఎక్కువగా ఉంటుంది. మైక్రోఆర్ఎన్ఏలు ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇతర అవయవాలకు వ్యాపించకుండా నిరోధించగలవు. మైక్రోఆర్ఎన్ఏల ఆధారంగా చికిత్సలను అభివృద్ధి చేయడానికి, మైక్రోఆర్ఎన్ఏలను కణాలకు సమర్థవంతంగా అందించడం ముఖ్యం.

మైక్రోఆర్ఎన్ఏలు కణితిని అణిచివేసేవిగా పనిచేస్తాయి:

ఈ క్యాన్సర్‌పై మైక్రోఆర్‌ఎన్‌ఏ ఆంకోజీన్ లేదా కణితిని అణిచివేసేదిగా పనిచేస్తుందని పరిశోధనలో తేలింది. అంటే ఇది క్యాన్సర్ కణాలు వ్యాప్తి చెందకుండా ఆపుతుంది. సాధారణ కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. మైక్రోఆర్ఎన్ఏలు ఎపిథీలియల్ నుండి మెసెన్చైమల్ ట్రాన్సిషన్, ఇంట్రావాసేషన్, ఎక్స్‌ట్రావాసేషన్, స్టెమ్ సెల్ నిచ్, మైగ్రేషన్ వంటి ప్రక్రియలను నియంత్రించడం ద్వారా టిఎన్‌బిసి పురోగతిని కూడా నిరోధించవచ్చు.

కొన్ని సవాళ్లు కూడా..

TNBCని నివారించడంలో మైక్రోఆర్ఎన్ఏలు సహాయపడతాయని పరిశోధన స్పష్టం చేసింది. అయితే దీనికి కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. TNBCలో మైక్రోఆర్ఎన్ఏల పాత్రను అర్థం చేసుకోవడానికి, వాటి చికిత్సా, రోగనిర్ధారణ సామర్థ్యాన్ని వెలికితీసేందుకు మరింత పరిశోధన అవసరం. దీని నుండి ఈ క్యాన్సర్‌పై మైక్రోఆర్‌ఎన్‌ఏలు ఎంత ప్రభావవంతంగా ఉన్నాయో, వాటిని ఎంత, ఏ పద్ధతిలో ఉపయోగించవచ్చో తెలుస్తుంది.