Male contraceptive pill: పురుషుల గర్భ నిరోధక మాత్రలు వచ్చేశాయి.. కేవలం 30 నిమిషాల్లో పని ప్రారంభం.. 

|

Feb 16, 2023 | 2:00 PM

ఎలుకలపై ప్రయోగాలు విజయవంతం అవడం.. ఒక్క చెడు ప్రభావం కూడా రాకపోవడంతో పరిశోధకులు మనుష్యులకు దీనిని అందించే చర్యలకు ఉపక్రమించారు.

Male contraceptive pill: పురుషుల గర్భ నిరోధక మాత్రలు వచ్చేశాయి.. కేవలం 30 నిమిషాల్లో పని ప్రారంభం.. 
Male Contraceptive Pill
Follow us on

గర్భనిరోధక మాత్రలు అంటే అవి మహిళలకు మాత్రమే అనే భావన ఉంది. పురుషుల్లో గర్భనిరోధకగా పనిచేసేవి కండోమ్స్, లేదా వ్యాసెక్టమీ. మహిళ్లలో గర్భ నిరోధక మాత్రలు వాడటం వల్ల అనేక రకాల సమస్యలను వారు అనుభవిస్తున్నారు. ముఖ్యంగా హార్మోన్ల సమతుల్యం దెబ్బతినడం.. వారి రుతక్రమం సక్రమంగా లేకపోవడం వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలోనే పురుషులకు గర్భ నిరోధక మాత్రలు ఉంటే బాగుంటుందన్న వాదన బలంగా బయటకు వచ్చింది. దీనికి సమాధానం చెబుతూ లను పరిశోధకులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవి కేవలం 30 నిమిషాల్లోనే పనిచేయడం ప్రారంభిస్తాయి. దాని ప్రభావం 24 గంటల వరకూ ఉంటాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఎవరు కనిపెట్టారు..

పురుషుల గర్భనిరోధక మాత్రలను వీల్ కార్నెల్ మెడిసిన్ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఇది పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ ను ప్రభావితం చేసే సోల్యూబుల్ అడెనిలిల్ సైక్లాస్(ఎస్ఏసీ) అనే ప్రోటీన్ లక్ష్యంగా చేసుకొని పనిచేస్తుంది. ఈ ప్రోటీన్ ఉత్పత్తి కాకుండా ట్యాబ్లెట్ నిరోధిస్తుంది. ఫలితంగా స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది.

ఎలుకలపై ప్రయోగాలు..

ఈ మెడిసిన్ సక్రమంగా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి పరిశోధకులు ఎలుకలపై ప్రయోగాలు చేశారు. మగ ఎలుకలకు టీడీఐ11862 అనే ఎస్ఏసీ నిరోధకాన్ని ఇచ్చి.. తర్వాత అది ఆడ ఎలుకలతో కలిసేలా చేశారు. దాదాపు 52 సార్లు సంభోగం అయ్యేలా ఎలుకలను ప్రోత్సహించినప్పటికీ ఒక్క ఆడ ఎలుక కూడా గర్భవతి కాలేదు. అంతేకాక ఇది చాలా వేగంగా పనిచేసిందని పరిశోధకులు కొనుగొన్నారు. 30 నుంచి 60 నిమిషాల్లోనే ఎలుకల స్పెర్మ్ లో దీని ప్రభావం కనిపించింది. అలాగే 100 శాతం ప్రభావవంతంగా ఇది పనిచేసింది. పైగా ఈ ట్యాబ్లెట్ ప్రభావం ఆ మగ ఎలుకపై కేవలం 24 గంటల వరకూ మాత్రమే పనిచేసింది. ఆ తర్వాత ఎలుకలకు తిరిగి సంతానోత్పత్తి సాధించగలిగే విధంగా అయ్యిందని పరిశోధకులు గుర్తించారు. ఆరు వారాల వరకూ పరిశోధకులు ఎలుకలకు ఈ మందు రోజూ ఇచ్చినా ఎటువంటి చెడు ప్రభావాలు ఇవ్వలేదు.

ఇవి కూడా చదవండి

ఎప్పుడు తీసుకుంటే మంచిది..

ఎలుకలపై ప్రయోగాలు విజయవంతం అవడం.. ఒక్క చెడు ప్రభావం కూడా రాకపోవడంతో పరిశోధకులు మనుష్యులకు దీనిని అందించే చర్యలకు ఉపక్రమించారు. ఒక వేళ మీరు కూడా కొంత కాలం సంతానోత్పత్తిని నిరోధించాలని అనుకుంటే రాత్రి సమయంలో ఈ పిల్ ను తీసుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..