Cancer cells: ప్రస్తుత వైద్యావిధానంలో సరికొత్త మార్పుల చోటు చేసుకుంటున్నాయి. కేవలం సాంకేతికతను అందిపుచ్చుకుని అత్యాధునిక వైద్యాన్ని అందించడమే కాక తమ చుట్టూ అందుబాటులో ఉన్న వనరులతో తక్కువ ఖర్చుతో సామాన్యులకు సైతం వైద్యం అందించేందుకే శాస‍్త్రవేత్తల(Scientist)బృందం నిరతరం కృషి చేస్తోంది. అందులో భాగంగానే శాస్త్రవేత్తలు క్యాన్సర్ చికిత్స(Cancer Treatment), త్వరితగతిన గుర్తించు విధానాలపై అధ్యయనాలు చేశారు. తాజా అధ్యయనాల్లో చీమలు అత్యంత సులభంగా మానవుని శరీరంలోని క్యాన్సర్ కణాలను సులభంగా గుర్తించగలవు అని కునుగొన్నాం అంటున్నారు శాస్త్రవేత్తలు.
ఇప్పటి వరకు చీమలు శ్రామిక శక్తి గురించి మాత్రమే ఘనంగా చెప్పుకునేవారం.. అయితే ఇక నుంచి చీమల్లో ఉన్న మరో గొప్పదనం ఉందని.. చీమలు మానవుని శరీరంలోని క్యాన్సర్ కణాలను గుర్తించగలవు అంటున్నారు . ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు. చీమల తమ వాసన సామర్థ్యాన్ని ఉపయోగించి క్యాన్సర్ ను గుర్తిస్తాయని తెలిపారు. ఈ మేరకు శాస్త్రజ్ఞులు సిల్కీ చీమలపై ప్రయోగం చేశారు. వాటికి రివార్డ్ సిస్టమ్ ద్వారా శిక్షణ ఇచ్చింది. చక్కెర ద్రావణంతో వాసనకు సంబంధించిన శిక్షణ ఇచ్చి అనంతరం చీమలు క్యాన్సర్ కణాలను గుర్తించేలా చేశారు.
అంతేకాదు ఈ చీమలు మాదక ద్రవ్యాలు, పేలుడు పదార్థాలు లేదా ఇతర వ్యాధులకు సంబంధించిన వాసనలను కూడా పసిగట్టే సామర్థ్యం పై పరిశోధనలు కొనసాగిస్తున్నారు. చీమలకు గొప్ప ఘ్రాణ శక్తి కలిగి ఉంటుందట. పైగా కుక్కుల కంటే చాలా వేగంగా క్యాన్సర్ కణాల గుర్తింపు శిక్షణను చీమలకు ఇచ్చామని తెలిపారు.
Nirmal Kids: ఈ పిల్లలు అప్ డేట్ అయ్యారు.. హొలీ కోసం కొలల ఆడుతూ.. పేటీఎంతో డబ్బులు అడుగుతున్నారు