మహిళల జీవితంలో గర్భం ధరించడం అనేది అత్యంత మధుర ఘట్టం. అమ్మ కాబోతున్నానే ఆనందం ఓ వైపు.. కడుపులో బిడ్డ పెరుగుతున్న సంతోషం మరోవైపు.. ఆమెను ఆనందంలో ముంచెత్తుతాయి. తమ కలల ప్రతిరూపం ఎప్పుడెప్పుడు బయటకి వస్తుందా.. ఎప్పుడెప్పుడు చిన్నారిని చూడాలా అని ఆరాటపడుతుంటారు. బిడ్డ కడుపులో పెరుగుతున్నాడనే సమాచారం తెలిసినప్పటి నుంచే ఇక హడావుడి మొదలవుతుంది. చిన్నారి తొమ్మిది నెలలు పెరిగి, తల్లి గర్భం నుంచి బయటపడే సందర్భం వరకు ఎదురుచూస్తుంటారు. ఆ క్రమంలో కడుపులో ఉండే పిల్లలు చేసే అల్లరి అంతా ఇంతా కాదండోయ్.. కాళ్లతో తన్నడం, కదలడం వంటివి చేస్తుంటారు. వాటిని చూసి తల్లి ఎంతో మురిసిపోతుంది. బిడ్డ ఆరోగ్యంగా పెరిగేందుకు కొన్ని రకాల మందులనూ ఉపయోగిస్తుంటారు. వైద్యులు సూచించిన మెడిసిన్స్ ను తీసుకుంటుంటారు. అయితే సాధారణ క్యాప్యూల్స్ తో పోలిస్తే.. ఆర్గానిక్ క్యాప్సూల్స్ ఇవ్వడం వల్ల బిడ్డ చాలా సంతోషంగా ఉంటుందని శాస్త్రవేత్తలు నిర్ధరించారు.
ఇంగ్లాండ్‌లోని సుమారు 100 మంది గర్భిణీలపై పరిశోధనలు జరిపారు. వారికి రెండు రకాల మెడిసిన్స్, ఆహార పదార్ధాలు ఇచ్చారు. 35 మంది మహిళలను సాధారణ పదార్థాలు, మరో 35 మందికి ఆర్గానిక్ ఆహారాన్ని అందించారు. 20 నిమిషాల తర్వాత వారిని 4D అల్ట్రాసౌండ్ స్కాన్‌లతో పరీక్షించారు. సాధారణ పదార్థాలకు గురైన మహిళల గర్భంలోని శిశువులు మొహమాటంగా, ఆర్గానిక్ ఆహార పదార్థాలను తీసుకున్న మహిళల గర్భంలోని శిశువులు నవ్వుతున్నట్లుగా కనిపించాయి. వీటిని బట్టి గర్భంలోని పిండం.. పరిపక్వత చెందుతున్న సమయంలో రుచులకు ప్రతిస్పందిస్తున్నట్లు గుర్తించారు.
Keen on carrot, not so keen on kale…
Fetuses make “laugh” or “cry” faces in reaction to different flavours according to @FetalLab @DurhamPsych.
This is the 1st direct evidence that fetuses react differently to various tastes & smells in the womb ? https://t.co/13UKS7IjVM pic.twitter.com/xAqXGDqxQl
— Durham University (@durham_uni) September 22, 2022
గర్భవతిగా ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే తల్లులు కూడా తమ పిల్లలు తక్కువ తినేవాళ్ళుగా ఉంటారని పరిశోధకులు తెలిపారు. అయినప్పటికీ, పిండాలు భావోద్వేగాలు, ఇష్టాలు, అయిష్టాలను కచ్చితంగా నిర్ధారించడానికి తదుపరి పరిశోధన అవసరమని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం