Parijata Leaves Benefits: కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా.. పారిజాత ఆకులతో స్వస్తి పలకండిలా!!

|

Aug 09, 2023 | 1:12 PM

కొంచెం దూరం నడవగానే మోకాళ్లలో నొప్పి వస్తుందా ? అయితే అది ఆర్థరైటిస్ సమస్య కావొచ్చు. అది తీవ్రం కాకముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఒక్కసారి కీళ్లనొప్పులు మొదలైతే.. వస్తూనే ఉంటాయి. అవి రాకుండా జాగ్రత్తపడటం చాలా అవసరం. ఆర్థరైటిస్ కు వయసుతో సంబంధం లేదు. ఇప్పుడు తినే ఆహార లోపం కారణంగా కూడా యుక్తవయసు వారికీ ఆర్థరైటిస్ సమస్య వస్తుంది. ఇందులో రకాలున్నా.. లక్షణాలు మాత్రం ఒకరకంగానే ఉంటాయి. కీళ్లనొప్పులు, ఎముకల నొప్పులు, ఎక్కువ సేపు నిలబడలేకపోవడం..

Parijata Leaves Benefits: కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా.. పారిజాత ఆకులతో స్వస్తి పలకండిలా!!
Parijat Health Benefits
Follow us on

కొంచెం దూరం నడవగానే మోకాళ్లలో నొప్పి వస్తుందా ? అయితే అది ఆర్థరైటిస్ సమస్య కావొచ్చు. అది తీవ్రం కాకముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఒక్కసారి కీళ్లనొప్పులు మొదలైతే.. వస్తూనే ఉంటాయి. అవి రాకుండా జాగ్రత్తపడటం చాలా అవసరం. ఆర్థరైటిస్ కు వయసుతో సంబంధం లేదు. ఇప్పుడు తినే ఆహార లోపం కారణంగా కూడా యుక్తవయసు వారికీ ఆర్థరైటిస్ సమస్య వస్తుంది. ఇందులో రకాలున్నా.. లక్షణాలు మాత్రం ఒకరకంగానే ఉంటాయి. కీళ్లనొప్పులు, ఎముకల నొప్పులు, ఎక్కువ సేపు నిలబడలేకపోవడం, నడవలేకపోవడం.. కొందరికైతే అడుగుతీసి అడుగువేయడం కూడా నరకంగా ఉంటుంది. ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారికి మన ఇంట్లోనే ఉన్న పారిజాత ఆకులతో అద్భుతమైన వైద్యం చేయొచ్చు. అదెలాగో తెలుసుకుందాం..

పారిజాత వృక్షాన్ని దైవ వృక్షంగా భావిస్తారు. సాధారణంగా కిందపడిన పువ్వులు పూజకు పనికిరావని అంటారు. కానీ పారిజాత వృక్షం నుంచి వచ్చే పువ్వులు కిందపడితేనే పూజకు వాడాలి. దీనివెనుక ఒక పురాణ కథ కూడా ఉంది. ఆ విషయం పక్కను పెడితే.. కీళ్లనొప్పులను తగ్గించడంలో.. పారిజాత ఆకులు ఎంతో ఉపయోగపడుతాయి.

కీళ్ల నొప్పులకు చెక్ పెట్టండిలా..

ఇవి కూడా చదవండి

*పారిజాత ఆకులు 6-7 తీసుకుని.. శుభ్రంగా కడిగి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ఒక గ్లాస్ నీటిలో కలిపి.. ఒక గిన్నెలో పోసి అరగ్లాసు అయ్యే వరకూ మరగనివ్వాలి. అలా వచ్చిన కషాయాన్ని రాత్రంతా అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయం పరగడుపునే తాగేయాలి. ఇలా నెల రోజులపాటు చేస్తే.. కీళ్లలో నొప్పులు తగ్గుతాయి. పారిజాత ఆకులలో ఉండే జిగురు కషాయం ద్వారా శరీరంలోకి వెళ్లి.. మోకాలిలో అరిగిపోయిన కీళ్లపై పనిచేస్తుంది. దీంతో కీళ్ల నొప్పులతో కాస్త ఉపశమనం లభిస్తుంది.

*అలాగే కొబ్బరి నూనెలో 5-6 చుక్కల పారిజాత నూనె వేసి.. కీళ్ల నొప్పులు ఉన్న చోట కాసేపు మర్దనా చేయాలి.ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే నొప్పులు తగ్గుముఖం పడతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి