Rప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో చాలా మంది గుండె పోటులతో మరణిస్తున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేదు.. ముఖ్యంగా యువత ఈ హార్ట్ ఎటాక్ తో ప్రాణాలు కోల్పోతున్నారు. మనతో మాట్లాడుతూనే ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. దీనికి ముఖ్య కారణం మన ఆహారపు, జీవన అలవాట్లే. జంక్ ఫుడ్ ఎక్కువగా తిన్నవారు, గంటలు గంటలు కూర్చొని పని చేసేవారు, సమయానికి తినలేని వారు, వ్యాయామం చేయకపోవడం వంటి పనులు రక్త నాళాల్లో ఎక్కువగా కొలెస్ట్రాల్ పేరుకుపోయేలా చేస్తున్నాయి. ఇది కాస్తా రక్త సరఫరాకు అడ్డంకులుగా ఏర్పడి హార్ట్ స్ట్రోక్ కి దారి తీస్తున్నాయి. మరి ఈ కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచేందుకు ఇప్పటికే ఎన్నో రకాల టిప్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు ఈజీగా కొన్ని రకాల పండ్లు, కూరగాయాల జ్యూస్ లు చేసుకుని తాగితే కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుకోవచ్చు. మరి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. వీటిల్లో ఏదో ఒకటి తాగినా.. కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుకొని, ఆరోగ్యంగా ఉండొచ్చు.
దానిమ్మ జ్యూస్:
దానిమ్మ జ్యూస్.. కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచుకునేందుకు చాలా హెల్ప్ చేస్తుంది. దానిమ్మ కాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంతో పాటు రక్త నాళాల్లో ఉన్న అడ్డంకులను తొలిగిస్తుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా కూడా ఉంటుంది. అంతేకాకుండా దానిమ్మ జ్యూస్ తాగితే రక్త హీనత సమస్య కూడా తగ్గుతుంది. ఎప్పుడైనా జంక్ ఫుడ్ ని అధికంగా తీసుకున్నప్పుడు.. ఒక గ్లాస్ దానిమ్మ జ్యూస్ తీసుకుంటే.. రక్త నాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా చూస్తుంది.
నారింజ పండ్ల జ్యూస్:
నారింజ పండ్ల జ్యూస్ లో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించేందుకు సహాయ పడుతుంది. నారింజ పండ్ల జ్యూస్ తాగినా కూడా కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచుకోవచ్చు. గుండెకు కూడా చాలా మంచి చేస్తుంది. అలాగే ఇందులో ఉండే సీ విటమిన్ కారణంగా చర్మ, జుట్టు సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉదయాన్నే ఈ జ్యూస్ తాగితే ఫ్రెష్ గా, యాక్టీవ్ గా ఉంటాం.
టమాటా జ్యూస్:
టమాటాలో కూడా చెడు కొలెస్ట్రాల్ ను అదుపులోకి తీసుకొచ్చేందుకు బాగా సహాయ పడుతుంది. ఇందులో ఉండే లైకోపిన్.. లిపిడ్ల స్థాయిలను పెంచుతుంది. టమాటా జ్యూస్ గుండె పని తీరును కూడా మెరుగు పరుస్తుంది. రోజూ టమాటా జ్యూస్ తాగితే.. గుండె ఆరోగ్యమే కాకుండా స్కిన్ కూడా గ్లోగా, షైనీగా ఉంటుంది. అలాగే జుట్టు రాలే సమస్యలు కూడా తగ్గుతాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి