Black Coffee: ఆరోగ్యానికి మేలు చేసే ‘బ్లాక్‌ కాఫీ’.. బరువును తగ్గించడంలో కీలక పాత్ర.. ఎలాగంటే..

|

Oct 24, 2021 | 11:25 AM

Black Coffee: చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే బెడ్ కాఫీ తాగడం అలవాటు. ఆ తాగేదిఏదో బ్లాక్ కాఫీ తాగితే.. ఆరోగ్యానికి మేలు చేస్తుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు..

Black Coffee: ఆరోగ్యానికి మేలు చేసే బ్లాక్‌ కాఫీ.. బరువును తగ్గించడంలో కీలక పాత్ర.. ఎలాగంటే..
Black Coffee
Follow us on

Black Coffee: చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే బెడ్ కాఫీ తాగడం అలవాటు. ఆ తాగేదిఏదో బ్లాక్ కాఫీ తాగితే.. ఆరోగ్యానికి మేలు చేస్తుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజంతా యాక్టివ్‌గా ఉంచడమే కాదు.. అది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది. బ్లాక్ కాఫీలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే శరీరాన్ని విష వ్యర్థాల నుంచి కాపాడే యాంటీఆక్సిడెంట్స్ ఇందులో ఎక్కువగా ఉంటాయి. కాఫీలో ఉండే కెమికల్ కాంపౌండ్లు చాలా శక్తిమంతమైనవి అవి వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. ముఖ్యంగా ప్రాణాలు తీసే కాన్సర్ వ్యాధి రాకుండా కాఫీ అడ్డుకోగలదని నిపుణులు చెబుతున్నారు. అలాగే గుండె జబ్బులు, డయాబెటిస్ ఇలా ఎన్నో అనారోగ్యాలకు సరైన పరిష్కారంగా మనం బ్లాక్ కాఫీని చెప్పుకోవచ్చు.

అమెరికా వ్యవసాయ విభాగం (USDA) ప్రకారం… కాఫీ గింజలతో తయారుచేసిన ఓ కప్పు బ్లాక్ కాఫీలో 2 కేలరీలు ఉంటాయి. అంటే కాఫీలో కేలరీలు తక్కువే. అయితే.. కాఫీకి అదనంగా బెల్లం, పంచదార, పాలు, వెనీలా, సోయా మిల్క్, చాకొలెట్ సిరప్ వంటివి జత చేయకుండా తాగాలి. లేదంటే వాటిలో కేలరీలు ఎక్కువగానే ఉంటాయి. అవి కప్పుకు 700 కేలరీల దాకా పెంచేస్తాయి. అప్పుడు బరువు తగ్గడం కంటే పెరగడం ఎక్కువవుతుంది.

బ్లాక్‌ కాఫీతో బరువు తగ్గొచ్చు..
బ్లాక్‌ కాఫీలో క్లోరోజెనిక్‌ యాసిడ్‌ అనే పదార్థం కూడా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బ్లాక్‌ కాఫీలో క్లోరోజెనిక్‌ యాసిడ్‌ ఉండటం వల్ల రాత్రి భోజనం తర్వాత శరీరంలో గ్లూకోజ్‌ ఉత్పత్తి ఆలస్యం అవుతుంది. ఇకా కొత్త కొవ్వు కణాలు ఏర్పడటం తగ్గిపోతుంది. ఫలితంగా శరీరంలో తక్కువ కేలరీలు ఉంటాయి. ఇది రక్తపోటును నివారించడంతో పాటు బరువు తగ్గేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఆకలిని నియంత్రిస్తుంది..
కాఫీలో ఉండే కెఫిన్‌ మన శరీరాలపై అనేక ప్రభావం చూపుతుంది. కెఫిన్‌ అనే పదార్థం మన మెదడును, కేంద్ర నాడీ వ్యవస్థను చురుకుగా పని చేసేందుకు సహాయపడుతుంది. మన శక్తి స్థాయిలను మెరుగుపర్చడంలో కూడా సహాయపడుతుంది.

బాడీలో నీరు ఎక్కువైతే కూడా బరువు పెరుగుతారు. ముఖ్యంగా పొట్ట పెరుగుతుంది. బ్లాక్ కాఫీ బాడీలో అవసరం లేని నీటిని బయటకు పంపేస్తుంది. తరచూ యూరిన్‌కి వెళ్లడం వల్ల బాడీలో అదనపు బరువు తగ్గుతుంది. అందువల్ల బ్లాక్ కాఫీ తాగడం అలవాటు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

కొవ్వును కరిగించే సామర్థ్యం..
గ్రీన్‌ కాఫీ గింజలు మన శరీరంలో కొవ్వును కరిగించే సామర్థ్యాన్ని పెంచేందుకు సహాయపడుతుంది. ఇది కాలేయానికి సహాజమైన క్లెన్సర్‌గా కూడా పని చేస్తుంది. కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌, మితిమీరిన లిపిడ్‌లను తొలగిస్తుంది. మన జీవక్రియ సమర్ధవంతంగా పని చేస్తుంది.

ఇవి కూడా చదవండి:

Custard Apple Benefits: సీతాఫలాలతో అదిరిపోయే బెనిఫిట్స్‌.. డయాబెటిస్‌, గుండె జబ్బులున్నవారు తినొచ్చా..?

Women Health Tips: మహిళలు ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే ఆ సమస్యలు దూరం..!

Blood Sugar Levels: చెమటతో రక్తంలో షుగర్‌ లెవల్స్‌ గుర్తింపు.. కొత్త డివైజ్‌ను తయారు చేసిన అమెరికా పరిశోధకులు..!

Acidity Prevention Tips: మీరు ఎసిడిటితో బాధపడుతున్నారా..? ఇలాంటి చిట్కాలు పాటించినట్లయితే ఎంతో ప్రయోజనం..!