Diabetes: ప్రస్తుతం మధుమేహం సమస్య ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ముప్పుగా మారింది. అయితే ఈ వ్యాధికి ఇంకా ఏలాంటి ఔషధాలు కనిపెట్టలేరు. కావున ఈ సమస్యతో బాధపడుతున్న వారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మేలని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి ప్రతిరోజూ ఎంత ప్రోటీన్, మినరల్, కొవ్వు, కార్బోహైడ్రేట్ తీసుకోవచ్చో తెలుసుకోవాలి. మధుమేహం వచ్చిన వాళ్లు కొన్ని చిట్కాలని పాటించాలి. అప్పుడు రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. మందులేని మహమ్మారిగా మారిన మధుమేహనికి ఆయుర్వేద నిపుణులు పలు రకాల ఇంటి చిట్కాలను పాటించమని సూచిస్తున్నారు. వాటిల్లో రాగులతో డయాబెటిస్ బాధితులకు మేలు జరుగుతుందని చెబుతున్నారు.
రాగుల్లో అమైనో యాసిడ్ లెసిథిన్ మరియు మేథినోన్ కలిగి ఉండి, కాలేయంలోని అదనపు కొవ్వు తొలగించడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయి తక్కువ చేయడానికి బాగా సహాపడుతుంది. మధుమేహం వ్యాధితో బాధపడుతున్న వారు తప్పకుండా గోధుమ పిండికి బదులుగా రాగి పిండిని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతో మధుమేహం మాత్రమే కాదు.. ఊబకాయం, అధిక రక్తపోటు (హై బీపీ) నుంచి కూడా ఉపశమనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
రాగుల్లో ప్రొటీన్, క్యాల్షియం, విటమిన్ డి, ఐరన్(Protein, Calcium, Vitamin D, Iron) కూడా సమృద్ధిగా లభ్యమవుతాయి. షుగర్ లెవల్స్ అదుపులోకి రావడానికి ఉపయోగపడతాయి. ఇందులో ఉండే గుణాలు ఎముకలను దృఢంగా చేసేందుకు కృషి చేస్తాయి. అయితే ఈ పిండితో చేసిన పదార్థాలను క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరంలో రక్తాన్ని కోరత లేకుండా చేస్తాయి. గుండె బలహీనత, ఉబ్బసం తగ్గిస్తుంది. వృద్దాప్యంలో వున్న వారు రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను భుజించడం వల్ల శరీరానికి బలం, శక్తి చేకూరుతాయి.
రాగి పిండితో చేసిన పదార్థాలలో అనేక రకాల ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అంతేకాకుండా ఇందులో శరీరానికి అవసరమైన ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అయితే ఏ ఆహారాలు తిన్న అవి అజీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. కాని ఈ పిండితో చేసిన పదార్థాలను తింటే జీర్ణసమస్యలు తొలగిపోవడమే కాకుండా జీర్ణక్రియ బలపడుతుంది. కావున శరీరంలోని రక్తంలో చక్కెర పరిమాణం నియంత్రణలో ఉంటుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి