Children Health: చిన్నారులకు సరైన పోషకాహారం ఇస్తున్నారా.. తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..

ఎదుగుతున్న చిన్నారులకు ఆరోగ్యకరమైన పోషకాహారం అందించడం చాలా ముఖ్యం. వారు తినే ఆహారం సమతులంగా లేదా అనేది చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. చిన్న వయసులోనే వారికి పౌష్ఠికాహారం...

Children Health: చిన్నారులకు సరైన పోషకాహారం ఇస్తున్నారా.. తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Nutrition For Children

Updated on: Jan 13, 2023 | 7:44 AM

ఎదుగుతున్న చిన్నారులకు ఆరోగ్యకరమైన పోషకాహారం అందించడం చాలా ముఖ్యం. వారు తినే ఆహారం సమతులంగా లేదా అనేది చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. చిన్న వయసులోనే వారికి పౌష్ఠికాహారం అందిస్తే.. వారు ఆరోగ్యకరమైన జీవితాన్ని సొంతం చేసుకుంటారు. పిల్లలకు పోషక అవసరాలు పెద్దల కంటే భిన్నంగా ఉంటాయి. వారి శరీరానికి సరైన అభివృద్ధి కోసం పెరుగుదల దశలో నిర్దిష్ట విటమిన్లు, ఖనిజాలు చాలా అవసరం. పిల్లల సంరక్షణ కోసం.. చాలా మంది తల్లిదండ్రులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని సిద్ధం చేసేందుకు కష్టపడుతున్నారు. దీంతో ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్స్ కు అలవాటు పడుతున్నారు. అవేవీ.. పోషకాలను అందించకపోగా.. ఆరోగ్య సమస్యలను తీసుకొస్తాయి. ఈ ఆహార పదార్థాలు అధిక కొవ్వు, చక్కెరను కలిగి ఉంటాయి. ఇది ఊబకాయం, మధుమేహం వంటి అనేక రకాల ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం కోసం నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటంటే…

పాలు, పెరుగు, చీజ్ వంటి పాల ఉత్పత్తులు పెరుగుతున్న పిల్లలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కాల్షియం, భాస్వరం పాలలోని రెండు ముఖ్యమైన ఖనిజాలు. ఇవి ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలు, గోళ్ల అభివృద్ధికి అవసరం. డైరీ ప్రొడక్ట్స్ అండ్ బోన్ హెల్త్ అనే పేరుతో నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్, యూఎస్ఏ పరిశోధన ప్రకారం.. ఎముకల ఆరోగ్యానికి అవసరమైన మరో పోషకమైన విటమిన్ డి కూడా పాలల్లో అధికమే. పెరుగుతున్న పిల్లలకు రోజుకు ఒకటి నుంచి రెండు గ్లాసుల పాలు తాగించాలి. పాలను ఇష్టపడకపోతే, కొన్ని గింజలను యాడ్ చేయాలి. ఫ్లేవర్స్ జోడించాలి. చాకొలెట్, స్ట్రాబెర్రీ, వెనీలా వంటి వాటిని పాలల్లో కలిపి తాగించాలి.

పిల్లలకు గుడ్లు అద్భుతమైనవి. మెదడు అభివృద్ధికి, పనితీరుకు అవసరమైన విటమిన్ బి పుష్కలంగా ఉన్నాయి. గుడ్లలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి, ఫోలేట్, జింక్, ఐరన్, సెలీనియం ఉంటాయి. ఓట్స్‌లో విటమిన్లు బి, ఇ, పొటాషియం, జింక్ వంటి ముఖ్యమైన పోషకాలు అనేకం ఉన్నాయి. ఆహారంలో కరిగే, కరగని ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపు నిండుగా ఉన్న భావన కలిగిస్తుంది. బ్రోకలీలో కనిపించే ఇతర ముఖ్యమైన పోషకాలలో ఇనుము, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, జింక్, ఫోలిక్ యాసిడ్ ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి