Post Covid Symptoms: అప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి.. పోస్ట్ కోవిడ్ లక్షణాలపై సంచలన విషయాలు వెల్లడించిన పరిశోధన..

Post Covid Symptoms: కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదు. తాజా అధ్యయనాల ప్రకారం.. రెండు సంవత్సరాల తర్వాత కూడా పోస్ట్ కోవిడ్ లక్షణాలు కనిపిస్తాయి. ఇటీవల, యూకేతో సహా అనేక దేశాల్లో కొత్త వేరియంట్‌ల కేసులు తెరపైకి వస్తున్నాయి. భారత్‌లోనూ దీని ప్రమాదం కొనసాగుతోంది. అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. లాంగ్ కోవిడ్ అంటే పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ ఇన్ఫెక్షన్ నుండి కోలుకున్న తర్వాత కూడా చాలా కాలం పాటు కొనసాగుతుంది. లాంగ్ కోవిడ్ సమస్య చాలా మందిలో కొనసాగుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

Post Covid Symptoms: అప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి.. పోస్ట్ కోవిడ్ లక్షణాలపై సంచలన విషయాలు వెల్లడించిన పరిశోధన..
Long Covid Effects

Updated on: Aug 22, 2023 | 10:43 PM

కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదు. తాజా అధ్యయనాల ప్రకారం.. రెండు సంవత్సరాల తర్వాత కూడా పోస్ట్ కోవిడ్ లక్షణాలు కనిపిస్తాయి. ఇటీవల, యూకేతో సహా అనేక దేశాల్లో కొత్త వేరియంట్‌ల కేసులు తెరపైకి వస్తున్నాయి. భారత్‌లోనూ దీని ప్రమాదం కొనసాగుతోంది. అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. లాంగ్ కోవిడ్ అంటే పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ ఇన్ఫెక్షన్ నుండి కోలుకున్న తర్వాత కూడా చాలా కాలం పాటు కొనసాగుతుంది. లాంగ్ కోవిడ్ సమస్య చాలా మందిలో కొనసాగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. గుండె, ఊపిరితిత్తులు, శ్వాస సమస్యలు, రుచి, వాసన లేకపోవడం వంటి సమస్యలు పోస్ట్ కోవిడ్‌లో కూడా కనిపిస్తున్నాయి. అందులో చాలా విచిత్రమైన లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సమస్యను సీరియస్‌గా తీసుకోవాలని కోవిడ్ నిపుణులు అంటున్నారు. చాలా కాలంగా ఆరోగ్య సమస్యలు ఉండవచ్చని హెచ్చరిస్తున్నారు. పోస్ట్ కోవిడ్‌కు సంబంధించి కొన్ని లక్షణాల గురించి తెలుసుకుందాం…

పోస్ట్ కోవిడ్ వల్ల కలిగే సమస్యలు..

కరోనాను శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌గా పరిగణిస్తారు. లాంగ్ కోవిడ్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని ఇటీవలి పరిశోధనలో తేలింది. కోవిడ్ సోకి, ఆ తరువాత తగ్గినప్పటికీ.. ఊపిరితిత్తులు, గుండె, కాలేయం, మూత్రపిండాలు వంటి అవయవాలు ప్రభావితమవుతాయి. ఇందులో.. వాసన, రుచి సామర్థ్యం తగ్గుతుంది. ఛాతీ నొప్పి కొనసాగుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. మెదడు వాపు సమస్య వస్తుంది.

పోస్ట్ కోవిడ్ కారణంగా ఎవరికి ఎక్కువ ప్రమాదం..

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నివేదిక ప్రకారం.. తీవ్రమైన కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తులు లేదా తీవ్రమైన అనారోగ్యంతో లేదా టీకా, మల్టీసిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ లేని వ్యక్తులలో పోస్ట్-కోవిడ్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఉంది. మూత్రపిండాలు, మెదడు సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కొన్ని నివేదికల ప్రకారం, కోవిడ్ తేలికపాటి లక్షణాలు ఉన్నవారిలో కూడా దీర్ఘకాల కోవిడ్ ప్రమాదం ఉండవచ్చు.

పోస్ట్ కోవిడ్ వింత లక్షణాలు..

ఇటీవలి అధ్యయనంలో కొంతమందికి లాంగ్ కోవిడ్‌లో నీలి పాదాలు కనిపించాయి. ది లాన్సెట్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయన నివేదిక ప్రకారం.. దీర్ఘకాల కోవిడ్ కారణంగా అక్రోసైనోసిస్ సమస్య కనిపించింది. అందులో నిలబడితే పాదాల రంగు నీలి రంగులోకి మారుతోంది. లీడ్స్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ మనోజ్ శివన్ రాసిన పరిశోధనా ప్రకారం, 33 ఏళ్ల వ్యక్తి పోస్ట్-కోవిడ్ సిండ్రోమ్ కారణంగా అక్రోసైనోసిస్‌ సమస్యను ఎదుర్కొన్నాడు.

కోవిడ్ తర్వాత లక్షణాలు..

అధ్యయన నివేదిక ప్రకారం.. బాధితుడు లేచి నిలబడిన ఒక నిమిషం తర్వాత పాదాలు ఎరుపు రంగులోకి మారుతాయి. కాలక్రమేణా నీలం రంగులోకి మారుతాయి. 10 నిమిషాల తర్వాత నీలం రంగు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే, మళ్లీ కూర్చోగానే, కాళ్లు మునుపటి స్థితికి వచ్చాయి. కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ తర్వాతే తన పాదాల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయని రోగి చెప్పాడు. అందుకే.. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..