Health Tips: పిల్లల నుంచి పెద్దల వరకు అందరికి పాలు తాగే అలవాటు ఉంటుంది. అంతేకాదు పాలతో రుచికరమైన ఆహారాలు, స్వీట్లు కూడా తయారు చేస్తారు. చిన్నతనం నుంచి పిల్లలకు పాలు తాగించడం వల్ల శరీరంలో పోషకాల కొరత ఉండదు. ఎముకలు దృఢంగా ఉంటాయి. క్యాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నందున పిల్లలు మాత్రమే కాదు పెద్దలు కూడా పాలు తాగాలని వైద్యులు సూచిస్తారు. పాలు దంతాలను బలపరుస్తాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో పాలు తాగకపోవడమే మంచిది. నిపుణుల అభిప్రాయం ప్రకారం శరీరంలోని కొన్ని ఆరోగ్య సమస్యలున్నవారు పాలు తాగకూడదు. వాటి గురించితెలుసుకుందాం.
1. శరీరం వాపు
శరీరంలో ఎక్కడైనా వాపు ఉన్నవారు పాలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే సంతృప్త కొవ్వు శరీరంలో మంటను మరింత పెంచుతుంది. మొటిమలు రావడానికి పాలు కారణమని చాలా పరిశోధనల్లో తేలింది.
2. కడుపు నొప్పి
ఒక వ్యక్తికి కడుపు సంబంధిత సమస్య ఉంటే అతను పాలు తాగకూడదు. ఇన్ఫెక్షన్ సమయంలో పాలు తాగడం వల్ల అది మరింత తీవ్రమవుతుంది. అలాగే మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పాలు తాగకూడదు. మీరు పాలు తాగాలని ఇష్టపడితే మొదట వైద్యుడిని సంప్రదించి ఆపై పాలని తీసుకోండి.
3. కాలేయంపై చెడు ప్రభావం
ఈ రోజులలో చాలామంది కాలేయ సమస్యలతో బాధపడుతున్నారు. ఇది చెడ్డ ఆహారపు అలవాట్లు, అనారోగ్యకరమైన జీవనశైలి వల్ల జరుగుతుంది. కానీ మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉంటే పాలు తాగవద్దు. ఇది సమస్యని మరింత పెంచుతుంది.
4. అలర్జీలు
ఎలర్జీ ఉన్నవారు పాలు తాగకూడదు. ఒకవేళ తాగాలనిపిస్తే ఖచ్చితంగా వైద్యుల సలహా తీసుకోండి. అలెర్జీ ఉన్నప్పుడు ఏ ఆహారం తినాలి ఏ ఆహారం తినకూడదో తెలుసుకుంటే మంచిది.
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి