Health News: ఆధునిక కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా బారిన పడుతున్నారు. దీనికి కారణం పొల్యూషన్. ఢిల్లీలాంటి ప్రాంతంలో కాలుష్య స్థాయి తీవ్రంగా ఉండటం వల్ల చాలామంది ఆస్తమా బారిన పడుతారు. మెట్రో నగరాలలో స్వచ్ఛమైన గాలి కూడా లభించని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో చాలామంది శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి వారు కచ్చితంగా డాక్టర్‌ని సంప్రదించాలి. అంతేకాకుండా వీరు తీసుకునే ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. కొన్ని ఆహారాలు వీరి వ్యాధిని పెంచుతాయి. అందుకే వాటికి దూరంగా ఉండాలి. అలాంటి ఆహారాల గురించి తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా వేరుశెనగలకు దూరంగా ఉండాలి. వేరుశెనగ వల్ల అలెర్జీ వస్తుంది. దీంతో ఆస్తమా వస్తుంది. కాబట్టి వేరుశెనగను తక్కువగా తింటే మంచిది. కానీ ఏదైనా తీసుకునే ముందు డాక్టర్ సలహా తీసుకవడం మర్చిపోవద్దు.
పాలు: పాలు చాలా ఉపయోగకరంగా ఉన్నప్పటికీ ఆస్తమా రోగులకు హానికరం. చాలా సార్లు పాలు తాగిన తర్వాత శ్వాసకోశ రోగులు దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కొంటారు. అందువల్ల వీరు పాలు తీసుకోకుండా ఉంటే మంచిది.
ఉప్పు: ఎక్కువ ఉప్పు శరీరానికి హాని చేస్తుంది. గొంతులో వాపు వస్తుంది. దీని కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది.
ఆల్కహాల్: వైన్, బీర్ రెండింటిలోనూ సల్ఫైట్ ఉంటుంది. ఇది శ్వాస తీసుకోవడం కష్టతరం చేస్తుంది. అందువల్ల ఆస్తమా రోగి ఆల్కహాల్, బీర్ రెండింటినీ తీసుకోకూడదు.
సోయా: సోయా చాలా సార్లు అలర్జీని కలిగిస్తుంది. అది ఆస్తమాకి కారణం అవుతుంది.
చేపలు: నాన్ వెజ్ తినే వారు చేపలు తీసుకోవడం మానేయాలి. ఆస్తమా రోగులు చేపలకు దూరంగా ఉండాలని సూచించారు.
గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.