Parent’s Sleeping with Kids: పిల్లల్ని మీతోనే పడుకోబెట్టుకుంటున్నారా.. అయితే ఈ చిట్కాలు మీకోసమే!!

|

Jul 28, 2023 | 6:55 PM

భార్యభర్తలు చాలా మంది తమ పిల్లలను తమ వెంటే బెడ్ పైనే పడుకోబెట్టుకుంటూంటారు. వారు పడిపోకుండా ఉండేందుకు వారిద్దరి మధ్యలో పిల్లలను పట్టుకోవడం మనదేశంలో చాలా కామన్. వారికి 10-12 ఏళ్లు వచ్చేంత వరకు ఇదే ధోరణి ఉంటుంది. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని..

Parents Sleeping with Kids: పిల్లల్ని మీతోనే పడుకోబెట్టుకుంటున్నారా.. అయితే ఈ చిట్కాలు మీకోసమే!!
Parent's sleeping with kids
Follow us on

భార్యభర్తలు చాలా మంది తమ పిల్లలను తమ వెంటే బెడ్ పైనే పడుకోబెట్టుకుంటూంటారు. వారు పడిపోకుండా ఉండేందుకు వారిద్దరి మధ్యలో పిల్లలను పట్టుకోవడం మనదేశంలో చాలా కామన్. వారికి 10-12 ఏళ్లు వచ్చేంత వరకు ఇదే ధోరణి ఉంటుంది. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని రిలేషన్‌ షిప్ ఎక్స్‌ పర్ట్స్ అంటున్నారు. దంపతుల మధ్య సాన్నిహిత్యం తగ్గడంతో పాటు పిల్లల ఎదుగుదలపై, వారిలో స్వతంత్ర భావాలు రేకెత్తడంపై ప్రభావం పడుతుందని అంటున్నారు నిపుణులు.

-పిల్లలకి మూడేళ్లు నుంచి నాలుగేళ్లు నడుస్తుండగా వారికి కొంచెం కొంచెంగా పేరెంట్స్ గదిలో సపరేట్ గా బెండ్ ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత వారికి సపరేట్ గదికి మార్చాలి. మొదట కాస్త భయంగా.. ఇబ్బంది పడినా మెల్లి మెల్లిగా వాళ్లు అలవాటు చేయాలి.

-రాత్రంతా ప్రత్యేక గదిలో పడుకోబెట్టడం కాకుండా.. కొన్ని గంటల చొప్పున పెంచుతూ పోవాలి. అలాగే ప్రత్యేక గదిలో పడుకోబెట్టినప్పటికీ వారిని మధ్యమధ్యలో గమనిస్తూ ఉండాలి.

ఇవి కూడా చదవండి

-వారు పడుకున్నారా.. లేదా.. ఏం చేస్తున్నారు? అని కెమెరాలు, బేబీ మానిటర్ లాంటివి అమర్చుకోవాలి. సాంకేతిక వాడుతూ పిల్లలను సంరక్షించుకోవాలి. ఇలా చేయడం వల్ల వారికి ప్రత్యేక గదికి అలవాటు చేయడంతో పాటు వాళ్లెలా పడుకుంటారోనన్న భయమూ ఉండదు.

-పిల్లల గదిని ఎంతో ఆకర్షనీయంగా, అందంగా బొమ్మలతో అలంకరిస్తే.. వారికి కూడా సంతోషంగా ఆ గదిలో పడుకోవడానికి ఇష్టపడతారు.

-పిల్లలు అభద్రతా భావానికి లోనుకాకుండా వారితో స్నేహంగా మెలగాలి. ఏదైనా సమస్య ఉంటే నిర్మొహమాటంగా చెప్పే పరిస్థితి వారికి కల్పించాలి. అలాగే వారి గదిలో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు లేకుండా చూసుకోవడం కూడా ముఖ్యమే.

-అలాగే పిల్లలు భయపెట్టే కథలు వినిపించడం, హార్రర్ సినిమాలు చూడటం లాంటివి చేస్తే వాళ్లు ఒంటరిగా పడుకోవడానికి భయపడతారు. కాబట్టి అలాంటి వాటికి పిల్లలను దూరంగా ఉంచాలి. ఎప్పుడైనా పిల్లలు ఒంటరిగా పడుకోవడానికి ఇష్టపడకపోయినా, భయపడినా ఆ సమయంలో వారితో కలిసి కాసేపు పడుకోవాలి.

-చుట్టాలు, అతిథులు ఇంటికి వచ్చినప్పుడు పిల్లలను మీతో పడుకోబెట్టుకుని వారికి పిల్లల గదిని కేటాయించాలి. అంతే తప్ప కొత్తవారితో పిల్లలను పడుకోమని బలవంత పెట్టవద్దు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి