Summer Tips: పేరెంట్స్‌ ఇది మీ కోసమే.. దంచికొడుతోన్న ఎండల నుంచి మీ చిన్నారులను ఇలా రక్షించుకోండి..

Summer Tips: ఎండలు దంచికొడుతున్నాయి ఏప్రిల్‌ నెల మధ్యలోనే సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు. రోడ్డుపైకి రావాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. భానుడి భగభగలకు పెద్దలే తట్టుకునే పరిస్థితుల్లో లేరు. ఇక చిన్నారుల...

Summer Tips: పేరెంట్స్‌ ఇది మీ కోసమే.. దంచికొడుతోన్న ఎండల నుంచి మీ చిన్నారులను ఇలా రక్షించుకోండి..
Summer Tips
Follow us

|

Updated on: Apr 12, 2022 | 5:15 PM

Summer Tips: ఎండలు దంచికొడుతున్నాయి ఏప్రిల్‌ నెల మధ్యలోనే సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు. రోడ్డుపైకి రావాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. భానుడి భగభగలకు పెద్దలే తట్టుకునే పరిస్థితుల్లో లేరు. ఇక చిన్నారుల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. అసలే వచ్చేవి సమ్మర్ హాలీడేస్‌ ఇక వారిని ఆపడం ఎవరి తరం కాదు. ఎండలో తిరుగుతూ అనారోగ్యాలను తెచ్చుకుంటారు. అయితే ఈ మండుటెండల్లో మీ చిన్నారులపై ఎలాంటి ప్రభావం పడకుండా వారి ఆరోగ్యాన్ని పదిలంటా ఉంచాలంటే కొన్ని టిప్స్‌ పాటించండి అవేంటంటే..

  1.  సెలవులు వచ్చాయంటే చిన్నారులను ఆపడం ఎవరి తరం కాదు. ఎంత వద్దని వారించినా బయటకు వెళ్తుంటారు. అయితే ఎండలు తీవ్రంగా ఉండే సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చిన్నారులను బయటకు వెళ్లకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఎండ తీవ్రంగా ఉంటుంది. ఈ సమయంలో వారిని ఇంటికే పరిమితం చేయాలి.
  2. సన్‌ స్క్రీన్‌ అనేది కేవలం పెద్ద వారికి మాత్రమే అనే భావనలో మనం ఉంటాం. అయితే చిన్నారులకు కూడా సన్‌స్క్రీన్‌ను ఉపయోగించాలి. పెద్దవారితో పోలిస్తే చిన్నారుల చర్మం ఇంకా మృదువుగా ఉంటుంది. కాబట్టి చిన్నారుల కోసం ప్రత్యేకంగా లభించే లోషన్స్‌ను ఉపయోగించాలి. అంతేకాకుండా బయటకు వెళ్లే సమయంలో గొడుగులు, క్యాప్‌లను ఉపయోగించాలి.
  3. చిన్నారులకు వేసే డ్రస్‌లు లైట్‌ కలర్‌ ఉండేలా చూసుకోవాలి. సమ్మర్‌లో కాటన్‌ డ్రస్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలి. దీని ద్వారా చెమట త్వరగా ఇంకిపోతుంది. తద్వారా చర్మ సంబంధిత సమస్యలు దరిచేరవు. ఎట్టి పరిస్థితుల్లో సమ్మర్‌లో నలుపు రంగు దుస్తులు వేయకండి.
  4. వేసవిలో సరిపడ నీరు తాగమని నిపుణులు సూచిస్తాంటారు. దీంతో శరీరం డీహైడ్రేషన్‌కు గురికాదు.. తద్వార తలనొప్పి, శరీరం నీరసించడం వంటి సమస్యలు ఎదురుకావు. కాబట్టి చిన్నారులకు క్రమంతప్పకుండా మంచి నీటిని ఇస్తుండాలి. రోజులో కనీసం 2 నుంచి 3 లీటర్ల నీటిని తాగించాలి. కేవలం మంచి నీరు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు కొబ్బరి నీరు, నిమ్మరసం వంటివి కూడా ఇస్తుండాలి.
  5. ఇన్ని రకాల చర్యలు తీసుకున్నా కొన్ని సందర్భాల్లో ఎండ దెబ్బ తగులుతుంటుంది. కాబట్టి చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. వారిలో ఏమాత్రం తేడా కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. ముందుగానే అలర్ట్‌ అయితే ప్రమాదం నుంచి బయటపడొచ్చు.

Also Read: Krishna District: మంత్రి జోగి రమేష్ ఊరేగింపులో అపశృతి.. సర్పంచ్ గుండెపోటుతో మృతి

Pawan Kalyan: అనంతపురం జిల్లాలో కౌలు రైతుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ ఆర్ధిక సాయం

Viral Video: స్టేజ్ పై వధువు డ్యాన్స్.. అదిరిపోయే స్టెప్పులకు నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్..