క్యాన్సర్‏ను అదుపుచేయడానికి ఉల్లిపాయాలు సహయపడతాయా ? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

|

Feb 05, 2021 | 7:44 PM

సాధరణంగా ఇండియాలో వంటింట్లో ముఖ్యమైన ఆహారపదార్థం ఉల్లిపాయ. వీటిని ఉపయోగించకుండా చేసుకునే వంటలు చాలా అరుదు. ముఖ్యంగా మిర్చీ, బజ్జీల్లాంటి స్కాక్

క్యాన్సర్‏ను అదుపుచేయడానికి ఉల్లిపాయాలు సహయపడతాయా ? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
onions
Follow us on

Health News: సాధరణంగా ఇండియాలో వంటింట్లో ముఖ్యమైన ఆహారపదార్థం ఉల్లిపాయ. వీటిని ఉపయోగించకుండా చేసుకునే వంటలు చాలా అరుదు. ముఖ్యంగా మిర్చీ, బజ్జీల్లాంటి స్కాక్ ఐటమ్స్‏తోపాటు, నాన్ వెజ్ వంటకాల్లో కూడా ఉల్లి ముఖ్యంగా వాడుతుంటాం. అయితే ఉల్లిపాయాలను తినడం వలన చాలా ప్రయోజనాలున్నాయి.

రోజూ ఉల్లిపాయ తినడం వలన అనారోగ్య సమస్యలను అదుపులో ఉంటాయి. అలాగే గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాదులకు చికిత్సతోపాటు నివారణకు కూడా ఇవి సహయపడతాయి. అంతేకాదు ఇవి బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, ఆంజినా, జలుబు, ఉబ్బసం ఉంటి వ్యాధులను నివారించగలవని నిపుణులు చెబుతున్నారు. ఇవే కాకుండా ఉల్లిపాయాలకు క్యాన్సర్ వ్యాధీని నివారించే గుణం ఉంటుందని.. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ క్వెర్సెటిన్ పెద్ద మొత్తంలో ఉంటుందని అధ్యయనాల్లో తేలింది. ఉల్లిపాయాలను రోజూ తీసుకోవడం వలన క్వెర్సెటిన్ క్యాన్సర్ వ్యాప్తిని నివారించి.. జీర్ణశయాంతర ప్రేగు అభివృద్ధిని నివారించడానికి యాంటీ ఆక్సిడెంట్ బాగా పనిచేస్తుంది. అలాగే శరీరంలో పేరుకుపోయిన ఫ్రీరాడికల్స్‏ను తొలగిస్తుంది.

సెల్యులార్ జీవక్రియలోని రసాయన ఉపఉత్పత్తులు ఆరోగ్యకరమైన కణాలను క్యాన్సర్ కణాలుగా మార్చగల సామర్థ్యం ఉంటాయి. వాటిని నాశనం చేసే శక్తి ఉల్లిపాయలకు ఉంటుంది. అయితే ఉల్లిపాయాలు పూర్తిగా క్యానర్‏ను నివారించలేవు.. కానీ చికిత్సతోపాటు నివారణలో ఇవి సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కనుక సాధ్యమైనంత వరకు ఉల్లిపాయలను ప్రతి వంటకంలో ఉండేలా చూసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:

Benefits of Black Pepper: పోపుల పెట్టె ఔషధాల గని… నల్ల మిరియాలతో కలిగే ఆరోగ్యప్రయోజనాల గురించి తెలుసుకుందాం..!