Onion juice hair growth: జుట్టు రాలడం ఇప్పుడు మహిళలకు, పురుషులకు పెద్ద సమస్య అయిపోయింది. మొదట పలచగా రాలుతున్నప్పుడు లైట్ తీసుకోవడం.. తర్వాత తీవ్రత పెరిగితే బాధపడటం కామనైపోయింది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమి వస్తుంది చెప్పండి. ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత జుట్టు రాలడం సాధారణం. కానీ చిన్న వయసులోనే జుట్టు రాలడం జరిగితే, దానిపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. ఈ రోజు జట్టు రాలడాన్ని నివారించడానికి మేము మీకు కొన్ని సహజమైన పద్ధతులను చెప్పబోతున్నాము. ఈ పద్దతులు పాటిస్తే.. మీ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్‌కి చెక్ పెట్టవచ్చు.
-మీరు జుట్టు రాలడం సమస్యతో బాధపడుతుంటే, ఈ రెమెడీని ట్రై చెయ్యండి. కలబంద వల్ల మనషులకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే జుట్టు, చర్మానికి కూడా కలబంద చాలా ఉపయోగపడుతుంది. కలబంద, కొబ్బరి నూనె, ఉల్లిపాయ రసాన్ని మిక్స్ చేసి జుట్టుకు పూయడం వల్ల జుట్టు రాలడం సమస్య నుంచి బయటపడవచ్చు.
-నూనె తయారీకి మొదటిగా చెయ్యాల్సింది ఉల్లిపాయను మెత్తగా రుబ్బుకోవడం. లేదా మిక్సీలో వేసి జ్యూస్‌లా పట్టడం. అయితే ఉల్లిపాయ రసం తాజాగా ఉండాలి. తరువాత కలబంద పేస్ట్, కొబ్బరినూనెతో ఉల్లిపాయ రసాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజూ జుట్టు మీద పూయాలి. తద్వారా మీ జుట్టు అందంగా, మందంగా, పొడవుగా, బలంగా కనిపిస్తుంది.
– ఉల్లిపాయ రసం, ఆలివ్ ఆయిల్ కలిపి నెత్తిమీద పూయడం వల్ల చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు. దీనిలోని పోషకాలు జుట్టులో చుండ్రును తగ్గించడానికి పనిచేస్తాయి. అలాగే జుట్టు మృదువుగా, మెరిసేదిగా మారుతుంది.
జుట్టు రాలడానికి ప్రధాన కారణాలలో చుండ్రు ఒకటి. సరైన మొత్తంలో పోషకాలను అందకపోతే.. చుండ్రుతో సహా ఇతర సమస్యలు వస్తాయి. జుట్టు రాలడాన్ని నివారించడానికి ఉల్లిపాయ రసాన్ని మీ జుట్టు సంరక్షణ దినచర్యలో చేర్చడానికి ప్రయత్నించండి. మీ జుట్టు పొడవు ప్రకారం ఉల్లిపాయ రసం తీసుకోండి. అందులో ఒకటి నుండి రెండు టీస్పూన్ల తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ నెత్తితో సహా జుట్టు అంతా రాయండి. వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల చుండ్రును వదిలించుకోవచ్చు. జుట్టు పెరుగుదల కూడా పెరుగుపడుతుంది.
(గమనిక: ఏదైనా చికిత్సకు ముందు మీరు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.)
Also Read: మాస్క్ పెట్టుకోని వ్యక్తులపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. నేడు కోర్టు ముందుకు
మయన్మార్ సరిహద్దులో పట్టుబడిన తలనీలాలపై దుమారం.. ప్రచారంపై టీటీడీ సీరియస్.. పోలీసులకు ఫిర్యాదు