World Vegan Day: నేడు వరల్డ్‌ వేగన్ డే.. అసలీ వేగన్‌ డైట్‌ ఏంటి.? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా.?

|

Nov 01, 2021 | 12:13 PM

World Vegan Day: ఇటీవల వెగన్‌ డైట్‌ను పాటించే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. సోషల్‌ మీడియాలో ప్రచారం పెరగడం, ఈ కొత్త రకం డైట్ వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతుండడంతో చాలా మంది..

World Vegan Day: నేడు వరల్డ్‌ వేగన్ డే.. అసలీ వేగన్‌ డైట్‌ ఏంటి.? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా.?
World Vegan Day
Follow us on

World Vegan Day: ఇటీవల వేగన్‌ డైట్‌ను పాటించే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. సోషల్‌ మీడియాలో ప్రచారం పెరగడం, ఈ కొత్త రకం డైట్ వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతుండడంతో చాలా మంది ఆకర్షితులవతున్నారు. ముఖ్యంగా యువత ఎక్కువగా ఈ డైట్‌ను ఫాలో అవుతున్నారు. అమీర్‌ ఖాన్‌, కంగనా రనౌత్‌, సోనమ్‌ కపూర్, అనుష్క శర్మ, శ్రద్ధా కపూర్ వంటి సెలబ్రిటీలు సైతం ఈ డైట్‌ను పాటిస్తున్నారు. ఇక ప్రతీ ఏంటా నవంబర్‌ 1న ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేగన్‌ లవర్స్‌.. వరల్డ్‌ వెగన్‌ డేను జరుపుకుంటున్నారు. వేగన్‌ సొసైటీని తొలిసారి 1994లో వీటిని ప్రారంభించారు. తాజాగా ఈ ఆర్గనైజేషన్‌ ప్రారంభమై 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో అసలు వేగన్‌ డైట్‌ అంటే ఏంటి.? ఈ డైట్‌లో ఎలాంటి ఆహారం ఉంటుంది? వీటివల్ల కలిగే ప్రయోజనలు ఏంటి.? అన్న విషయాలు ఇప్పుడు చూద్దాం..

వేగన్‌ డైట్‌ అంటే సింపుల్‌గా చెప్పాలంటే పూర్తిగా శాఖాహార పదార్థాలనే తీసుకోవడం. జంతు సంబంధిత ఆహార పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉంటూ, కేవలం వృక్ష సంబంధిత ఆహారాలను తీసుకోవడం ఈ డైట్‌ ముఖ్య ఉద్దేశం. ఇక వెగన్‌ డైట్‌లో సాధారణంగా పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు, బఠానీలు, బీన్స్‌, చిక్కుడు జాతి గింజలు, నట్స్‌, సీడ్స్‌, బ్రెడ్‌, రైస్‌, పాస్తా, సోయా మిల్క్‌, కొబ్బరిపాలు, బాదం పాలను ఆహారంలో భాగంగా తీసుకుంటారు. వెగన్‌ డైట్‌లో తీసుకోకూడని ఆహార పదార్థాల విషయానికొస్తే.. జంతు సంబంధిత బీఫ్, పోర్క్‌, మటన్‌, చికెన్‌, చేపలు, ఇతర మాంసాహారాలు, కోడిగుడ్లు, చీజ్‌, వెన్న, పాలు, పాల మీద మీగడ, ఇతర పాల ఉత్పత్తులు ఉంటాయి.

వెగన్‌ డైట్‌తో కలిగే ప్రయోజనాలు..

* వేగన్‌ డైట్‌వల్ల ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించవచ్చని శాస్త్రవేత్తల అధ్యయనాల్లో వెల్లడైంది.

* ఈ రకమైన శాఖాహార డైట్‌ను పాటించడం ద్వారా భవిష్యత్తులో డయాబెటిస్‌, క్యాన్సర్‌ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయని పరిశోధనల్లో తేలింది.

* ఇక గుండెజబ్బులు రాకుండా ఉండడంతో పాటు, శరీరంలో కొలెస్ట్రాల్‌ కూడా చేరకుండా ఉంటుంది. ఇది హైబీపీ రాకుండా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

* శాఖాహార డైట్‌ వల్ల అధిక బరువు సమస్య నుంచి బయటపడడమే కాకుండా శరీరంలో కొవ్వు స్థాయిలు తగ్గుతాయని చెబుతున్నారు.

* వేగన్ డైట్‌ తీసుకోవడం వల్ల పాల ఉత్పత్తులు తీసుకోవడం వల్ల వచ్చే అలర్జీలకు చెక్‌ పెట్టవచ్చు.

* వేగన్ డైట్‌ బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుందని చాలా అధ్యయనాల్లో వెల్లడైంది.

Also Read: Cyber Crime: డబ్బులు తిరిగిస్తామంటూ నిరుద్యోగులకు టోకరా.. అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు..

7th Pay Commission: దీపావళికి ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌ న్యూస్‌.. పెరగనున్న డీఏ.. ఎంత జీతం పెరగనుందంటే..

Vaccine for Children: శుభవార్త.. త్వరలో చిన్నారులకు కొవిడ్ నుంచి రక్షణ.. ఫలించిన ప్రభుత్వ చర్చలు!