Oats Side Effects: ఈ సమస్యలు ఉన్నవారు ఓట్స్ కి దూరంగా ఉండాల్సిందే.. లేదంటే చాలా డేంజర్!

|

Oct 17, 2023 | 8:46 PM

ప్రస్తుతం ఇప్పుడు అందరూ ఎదుర్కొనే సమస్యల్లో అధిక బరువు కూడా ఒకటి. మారిన లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. ఆ తర్వాత తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుంది. దీంతో వెయిట్ లాస్ తగ్గించుకోవడానికి నానా తిప్పలు పడుతున్నారు. వెయిట్ తగ్గాలనుకునే వారందరూ తినే వాటిల్లో ఓట్స్ కూడా ఒకటి. ఓట్స్ తింటే నిజంగానే వెయిల్ లాస్ అవుతారా..! నిజమే ఓట్స్ తినడం వల్ల వెయిట్ లాస్ అవుతారు. ఓట్స్ ని తీసుకోవడం వల్ల బాడీకి కావాల్సినంత ఫైబర్ పుష్కలంగా అందుతుంది. అంతే కాదు జీర్ణ సమస్యలు..

Oats Side Effects: ఈ సమస్యలు ఉన్నవారు ఓట్స్ కి దూరంగా ఉండాల్సిందే.. లేదంటే చాలా డేంజర్!
Oats Health
Follow us on

ప్రస్తుతం ఇప్పుడు అందరూ ఎదుర్కొనే సమస్యల్లో అధిక బరువు కూడా ఒకటి. మారిన లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. ఆ తర్వాత తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుంది. దీంతో వెయిట్ లాస్ తగ్గించుకోవడానికి నానా తిప్పలు పడుతున్నారు. వెయిట్ తగ్గాలనుకునే వారందరూ తినే వాటిల్లో ఓట్స్ కూడా ఒకటి. ఓట్స్ తింటే నిజంగానే వెయిల్ లాస్ అవుతారా..! నిజమే ఓట్స్ తినడం వల్ల వెయిట్ లాస్ అవుతారు. ఓట్స్ ని తీసుకోవడం వల్ల బాడీకి కావాల్సినంత ఫైబర్ పుష్కలంగా అందుతుంది. అంతే కాదు జీర్ణ సమస్యలు కూడా ఉండవు. ఇందులో ఇంకా ప్రోటీన్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, బి, ఇ వంటి విటమిన్స్ కూడా ఉంటాయి. ఓట్స్ తినడం వల్ల స్కిన్ కి సంబంధించిన సమస్యలు కూడా తగ్గుతాయి. చిన్న వారి నుంచి పెద్ద వారి దాకా ఓట్స్ ని తినవచ్చు. అయితే కొన్ని రకాల సమస్యలతో ఇబ్బంది పడేవారు మాత్రం ఓట్స్ కి దూరంగా ఉండాలి. మరి ఎలాంటి సమస్యలు ఉన్నవారు ఓట్స్ కి దూరంగా ఉండాలో ఇప్పుడుత తెలుసుకుందాం.

డయాబెటీస్ ఉన్నవారు:

డయాబెటీస్ ఉన్న వారు ఓట్స్ కి చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే ఓట్స్ లో కార్బో హైడ్రేట్స్ ఉంటాయి. అంతే కాకుండా ఎక్కువ శాతంలో పిండి పదార్థాలు కూడా ఉంటాయి. ఇవి తినడం వల్ల బ్లడ్ లో షుగర్ లెవల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. దీంతో డయాబెటీస్ ఉన్నవారు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి షుగర్ తో ఉన్న వారు ఓట్స్ కి దూరంగా ఉండమే బెటర్.

ఇవి కూడా చదవండి

బరువు పెరుగుతారు:

అధిక బరువుతో ఉన్న వారు.. తగ్గాలని ఓట్స్ ని తీసుకుంటారు. అయితే తగితన మోతాదులో మాత్రమే ఓట్స్ ని తీసుకోవాలి. లేదంటే బరువు పెరిగే ఛాన్స్ లేక పోలేదు. కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకునే కాస్త తక్కువ మోతాదులోనే వైద్యులను సంప్రదించి తీసుకోవడం మంచింది.

అర్జీలు వచ్చే ఛాన్స్:

కొంత మంది బాడీకి, స్కిన్ కి కొన్ని రకాల పదార్థాలు పడవు. అలాంటి వారు కూడా ఓట్స్ ని చూసి తీసుకోవాలి. లేదంటే అలర్జీ సమస్యలతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఓట్స్ ని తినడం వల్ల కొంత మందికి దద్దుర్లు వస్తాయి. కాబట్టి ఇలాంటి వారు దూరంగా ఉండాలి.

కిడ్నీ సమస్యలు ఉన్న వారు:

కిడ్నీ సమస్యలు ఉన్న వారు సైతం ఓట్స్ ని చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. వీలైతే దూరంగా ఉండటమే బెటర్. ఓట్స్ లో భాస్వరం ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. దీంతో ఖనిజాలు ఇన్ బ్యాలెన్స్ అవుతాయి. కాబట్టి కిడ్నీ సమస్యలు పెరిగే అవకాశం ఉంది.

జీర్ణం అవడం కష్టం:

కొత్త మంది జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ఓట్స్ తింటే మరింతగా సమస్యలు ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఎందుకంటే వీటిల్లో ఎక్కువగా ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ ఉంటాయి. ఇవి త్వరగా జీర్ణం కావు. దీంతో కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి సమస్యలు ఏర్పడతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.