Niti Aayog: చక్కెర, ఉప్పు ఎక్కువుండే పదార్థలపై ఫ్యాట్ ట్యాక్స్!.. స్థూలకాయాన్ని నివారించడానికి నీతి ఆయోగ్ సిఫార్సు..

|

Feb 28, 2022 | 8:08 PM

నీతి ఆయోగ్(Niti Aayog) వార్షిక నివేదిక(Annual Report) ప్రకారం, జనాభాలో పెరుగుతున్న స్థూలకాయాన్ని పరిష్కరించడానికి..

Niti Aayog: చక్కెర, ఉప్పు ఎక్కువుండే పదార్థలపై ఫ్యాట్ ట్యాక్స్!.. స్థూలకాయాన్ని నివారించడానికి నీతి ఆయోగ్ సిఫార్సు..
Tax
Follow us on

నీతి ఆయోగ్(Niti Aayog) వార్షిక నివేదిక(Annual Report) ప్రకారం, జనాభాలో పెరుగుతున్న స్థూలకాయాన్ని పరిష్కరించడానికి చక్కెర, కొవ్వు, ఉప్పు అధికంగా ఉండే ఆహార పదార్థాలపై పన్ను(tax) విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్యాక్ ముందు లేబులింగ్ వంటి చర్యలు కూడా తీసుకోవచ్చని తెలుస్తుంది. జనాభాలో పెరుగుతున్న ఊబకాయాన్ని నియంత్రించడానికి ఏ చర్యలు తీసుకోవాలో ఆలోచిస్తున్నట్లు వార్షిక నివేదిక 2021-22 పేర్కొంది. దేశంలో పిల్లలు, యుక్తవయస్కులు, మహిళల్లో అధిక బరువు, ఊబకాయం పెరుగుతున్నట్లు ఆయోగ్ నివేదికలో పేర్కొంది. “ఈ సమస్యను పరిష్కరించడానికి విధాన నిర్ణయాలు చర్చించడానికి జూన్ 24, 2021న నీతి ఆయోగ్ సమావేశమైంది.

“నీతి ఆయోగ్, IEG, PHFI సహకారంతో దేశంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచిస్తుంది. అంటే HFSS ఆహారాల ఫ్రంట్-ఆఫ్-ప్యాక్ లేబులింగ్, మార్కెటింగ్, కొవ్వులు, చక్కెర, ఉప్పు అధికంగా ఉన్న ఆహారాలపై పన్ను విధించడం వంటి చర్యలు తీసుకోవచ్చు. నాన్-బ్రాండెడ్ నామ్‌కీన్‌లు, భుజియాలు, వెజిటబుల్ చిప్స్, స్నాక్ ఫుడ్స్‌పై 5 శాతం జీఎస్‌టీ, బ్రాండెడ్, ప్యాక్ చేసిన వస్తువులపై 12 శాతం జీఎస్‌టీ విధించే అవకాశం ఉంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5) 2019-20 ప్రకారం, 2015-16లో ఊబకాయం ఉన్న మహిళల శాతం 20.6 శాతం నుంచి 24 శాతానికి పెరిగింది. అయితే పురుషుల శాతం 18.4 శాతం నుంచి 22.9 శాతానికి పెరిగింది.

Read Also.. Epilepsy: ఈ లక్షణాలుంటే అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. తీవ్రమైన మూర్ఛ వ్యాధికి దారి తీయొచ్చు..