Corona: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ తీవ్రత తెలుసుకోవచ్చు.. సరికొత్త పరికరం రూపకల్పన..

|

Feb 21, 2021 | 3:44 PM

New AI-based Software For Covid-19: కరోనా వైరస్‌ మానవ శరీరంలో ప్రభావం చూపే ప్రధాన భాగాల్లో ఊపిరిత్తులు ఒకటి. వైరస్‌ సోకిన వారికి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ చేరుతుందని మనందరకీ తెలిసిందే. అయితే..

Corona: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ తీవ్రత తెలుసుకోవచ్చు.. సరికొత్త పరికరం రూపకల్పన..
Follow us on

New AI-based Software For Covid-19: కరోనా వైరస్‌ మానవ శరీరంలో ప్రభావం చూపే ప్రధాన భాగాల్లో ఊపిరిత్తులు ఒకటి. వైరస్‌ సోకిన వారికి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ చేరుతుందని మనందరకీ తెలిసిందే. అయితే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందన్న విషయం తెలుసుకోవడానికి ఇప్పటి వరకు ఉన్న విధానాలు చాలా సమయంతో కూడుకున్నవి. అలా కాకుండా చాలా తక్కువ సమయంలో సరైన ఫలితాలు తెలుసుకునేందుకు గాను శాస్ర్తవేత్తలు ఓ సరికొత్త పరికరాన్ని తయారు చేశారు.

కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సహాయంతో పనిచేసే ఈ పరికరాన్ని బెంగళూరుకు చెందిన ఐఐఎస్సీ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌) పరిశోధకులు, నార్వేలోని ఓస్లో యూనివర్సిటీ హాస్పిటల్‌, యూనివర్సిటీ ఆఫ్‌ అడ్జెర్‌ సహకారంతో అభివృద్ధి చేశారు. ఈ పరికరానికి ఆనమ్‌నెట్‌ అనే పేరు పెట్టారు. ఈ పరికరం ప్రత్యేక న్యూట్రల్‌ నెట్‌వర్క్‌ ఆధారంగా ఊపిరిత్తుల ఎక్స్‌రేలను చదివి కరోనా వైరస్‌ తీవ్రతను ఇట్టే గుర్తిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. దీంతో వేగంగా చికిత్స అందించే వీలుంటుందని శాస్ర్తవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ పరికరం ఊపిరితిత్తుల్లో కరోనా తీవ్రతను కచ్చితత్త్వంతో గుర్తిస్తుందన్నారు. ప్రస్తుతం కేవలం ఊపిరితిత్తుల పనితీరును మాత్రమే గుర్తించేందుకు ఉపయోగిస్తున్న ఈ పరికరాన్ని భవిష్యత్తులో బ్రెయిన్‌ స్కాన్‌ చేసేందుకు అనుగుణంగా మార్చేందుకు శాస్ర్తవేత్తలు కృషి చేస్తున్నారు.

 

Also Read: WhatsApp’s new privacy policy : మీ వాట్సాప్‌‌‌‌‌‌ చాటింగ్ సేఫ్‌‌‌‌‌గా ఉండాలంటే ఈ సెట్టింగ్స్ చేసుకోండి..