Heart Transplantation: గుండె మార్పిడి తర్వాత.. రోగి ఆరోగ్యంగా ఉండాలంటే ఈ విషయాలపై దృష్టిపెట్టాల్సిందే.. లేకపోతే

|

Aug 04, 2022 | 12:07 PM

గుండె మార్పిడి అనేది అరుదుగా చేసే సర్జరీ. గుండె వైఫల్యమైన బాధితులకు.. వేర్వేరు సందర్భాల్లో దాతల నుంచి సేకరించిన గుండెను సర్జరీ చేసి అమర్చుతారు. ఏ ఇతర చికిత్స మార్గాలు లేనప్పుడు, చివరి ప్రయత్నంగా రోగులను బతికించేందుకు ఈ సర్జరీని చేస్తారు.

Heart Transplantation: గుండె మార్పిడి తర్వాత.. రోగి ఆరోగ్యంగా ఉండాలంటే ఈ విషయాలపై దృష్టిపెట్టాల్సిందే.. లేకపోతే
National Heart Transplantat
Follow us on

National Heart Transplantation Day 2022: ప్రస్తుత కాలంలో చాలామంది గుండె సమస్యలతో బాధపడుతున్నారు. రక్త ప్రసరణలో ఏర్పడే అవాంతరాలు గుండె సమస్యలకు దారితీస్తున్నాయి. కొన్ని సార్లు గుండె వైఫల్యానికి కూడా కారణమవుతున్నాయి. చాలామంది గుండె వైఫల్యంతో మరణిస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాంటి వారికి అరుదుగా చేసే సర్జరీ గుండె మార్పిడి (Heart Transplantation).. గుండె మార్పిడి అనేది అరుదుగా చేసే సర్జరీ. గుండె వైఫల్యమైన బాధితులకు.. వేర్వేరు సందర్భాల్లో దాతల నుంచి సేకరించిన గుండెను సర్జరీ చేసి అమర్చుతారు. ఏ ఇతర చికిత్స మార్గాలు లేనప్పుడు, చివరి ప్రయత్నంగా రోగులను బతికించేందుకు ఈ సర్జరీని చేస్తారు. గుండె వైఫల్యం సందర్భంలో ఇతర చికిత్సలేవీ ఫలవంతం కానప్పుడు వైద్యులు సాధారణంగా దీనిని సిఫార్సు చేస్తారు. 2016లో 17.9 మిలియన్ల మంది కార్డియోవాస్కులర్ డిసీజెస్ (CVDలు) కారణంగా మరణించారు. ఇది మొత్తం ప్రపంచ మరణాలలో 31 శాతం. ఈ మరణాలలో 85 శాతం మంది గుండెపోటు, పక్షవాతం కారణంగా మరణించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. 75 శాతానికి పైగా CVD మరణాలు తక్కువ, మధ్య-ఆదాయ దేశాలలో జరుగుతున్నాయి. CVDలకు అత్యంత ముఖ్యమైన ప్రమాద కారకాలలో పెరిగిన రక్తపోటు ఒకటి. 2016లో 40-69 ఏళ్ల మధ్య వయసులో 45 శాతం మరణాలకు CVDలు కారణమని భారతదేశం నివేదించింది.

ఆగస్టు 3న జాతీయ గుండె మార్పిడి దినోత్సవం సందర్భంగా.. గురుగ్రామ్‌లోని మణిపాల్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్, కార్డియాలజీ నిపుణులు (కల్నల్) డాక్టర్ మోనిక్ మెహతా పలు విషయాలను న్యూస్9కి ప్రత్యేకంగా పంచుకున్నారు.. గుండె సమస్యలు, గుండె వైఫల్యం గురించి డాక్టర్ మోనిక్ మెహతా ఆసక్తికర విషయాలను తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఎండ్-స్టేజ్ హార్ట్ ఫెయిల్యూర్ అనేది శరీరంలో రక్తాన్ని పంప్ చేసే ప్రయత్నంలో గుండె కండరాలు తీవ్రంగా విఫలమయ్యే వ్యాధి. ఇతర చికిత్సలు ఇకపై పని చేయడం లేదని దీని అర్థం. ఎండ్-స్టేజ్ హార్ట్ ఫెయిల్యూర్ అనేది హార్ట్ ఫెయిల్యూర్ చివరి దశ. గుండె వైఫల్యం నిర్ధారణ అంటే గుండె కొట్టుకోవడం ఆగిపోతుందని కాదు. వైఫల్యం అనే పదం అంటే గుండె కండరాలు సాధారణంగా రక్తాన్ని పంప్ చేయడంలో విఫలమవుతున్నాయి. ఎందుకంటే గుండె దెబ్బతిన్నది లేదా చాలా బలహీనంగా మారిందని రెండూ అర్థాలు వస్తాయి.

గుండె మార్పిడి తర్వాత కోలుకోవడం ఏదైనా గుండె శస్త్రచికిత్స తర్వాత కోలుకున్నట్లేనని డాక్టర్ మెహతా పేర్కొన్నారు. ఆపరేషన్ స్టిచ్చెస్ నయం కావడానికి ఆరు నుంచి ఎనిమిది వారాలు పడుతుందన్నారు.

మార్పిడి అనంతర చర్యలు ఏమిటి?..

డాక్టర్ మెహతా మాట్లాడుతూ.. ‘‘రోగి సాధారణ స్థితి తిరిగి వచ్చిన తర్వాత కొన్ని ‘మిస్ చేయకూడని’ షెడ్యూల్‌లను అనుసరించాల్సి ఉంటుంది.’’ హార్ట్ ట్రాన్స్‌ప్లెంటేషన్ తర్వాత కొన్నింటిని తప్పకుండా అనుసరించాలి.. అవేంటంటే..

రెగ్యులర్ ఫాలో-అప్ అపాయింట్‌మెంట్‌లను కోల్పోకూడదు. “ఈ రెగ్యులర్ చెకప్‌లు సిఫార్సు చేస్తారు.. తద్వారా కొత్త గుండె మీ శరీరానికి అనుగుణంగా స్పందిస్తుందో లేదో డాక్టర్ తనిఖీ చేయవచ్చు.” కొన్ని ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి, రెగ్యులర్ చెకప్‌లతో నిపుణులు దానిపై కూడా పర్యవేక్షిస్తారు.

మందులు రెగ్యులర్‌గా తీసుకోవాలి.. మార్పిడి తర్వాత, రోగికి అనేక మందులు సూచిస్తారు. కోలుకోవడానికి ఇది చాలా ముఖ్యమైనది. ఈ మందులు తీసుకోవడం మర్చిపోకూడదు. ఒకరికి బ్లడ్ వర్క్ కూడా అవసరం, తద్వారా మేము యాంటీ-రిజెక్షన్ మెడిసిన్ స్థాయిలను గమనించవచ్చు.

నొప్పి, ఇన్ఫెక్షన్, అధిక రక్తపోటు లేదా మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ లేదా లిపిడ్ స్థాయిలను నిర్వహించడానికి లేదా నిరోధించడానికి నిపుణుల బృందం ఇతర మందులను సూచించవచ్చు. రోగిని కార్డియాక్ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్‌లో నమోదు చేయమని కూడా అడగవచ్చు.

సమతుల్య ఆహారం.. మంచి పోషకాహారం, వైద్యం రెండూ ముఖ్యమైనవి.. ఉప్పు, కొవ్వు తక్కువగా ఉన్న ఆహారాన్ని తినవలసి ఉంటుంది. అంతేకాకుండా నయం చేయడంలో సహాయపడే వివిధ రకాల ఆరోగ్యకరమైన ఆహారాలను కూడా సూచిస్తారు. ఆకలితో లేదా ఆహార మార్గదర్శకాలను అర్థం చేసుకోవడంలో మీకు సమస్య ఉంటే దయచేసి మీ గుండె మార్పిడి బృందాన్ని డైటీషియన్‌తో మాట్లాడమని సంప్రదించాలి..

నివారించాల్సిన పదార్థాలు.. గుండె మార్పిడి బాధితులు.. పొగాకు, మాదకద్రవ్యాలకు, మద్యపానానికి దూరంగా ఉండాలి. ఈ పదార్ధాలన్నీ గుండెకు హానికరం.

ఆల్కహాల్ వినియోగం రక్తంలో ట్రైగ్లిజరైడ్ స్థాయిలు పెరగడానికి కారణమవుతుంది.. కొరోనరీ ఆర్టరీ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుందని డాక్టర్ మోనిక్ మెహతా పేర్కొన్నారు.

Source Link

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి