సాధారణంగా మనం అనారోగ్యం బారిన పడుతున్న క్రమంలో శరీరం పలు సంకేతాలను ఇస్తుంది. ఇలానే.. గోళ్లు పసుపు రంగులో కనిపించినా లేదా గోర్లలో పగుళ్లు, కరుకుదనం ఉంటే జాగ్రత్త వహించాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గొళ్లలో మార్పు రావడమనేది మామూలు విషయం కాదంటున్నారు. ఈ లక్షణాలన్నీ చెడు కొలెస్ట్రాల్‌ను పెంచే లక్షణాలు కూడా కావచ్చు. చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరగడానికి అనేక కారణాలు ఉండవచ్చు. శరీరంలో ఆరోగ్యకరమైన కణాల ఏర్పాటులో కొలెస్ట్రాల్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే దాని అధికం పలు సమస్యలను కలిగిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు, మన శరీరం ముందుగా అనేక సంకేతాలను ఇస్తుంది. ఈ సంకేతాలను గుర్తించి సరైన సమయంలో చికిత్స చేయడం వల్ల ఈ వ్యాధిని నివారించవచ్చు.
కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే ఈ లక్షణాలు కనిపిస్తాయి..
కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరం, కాళ్లు, తొడలు, తుంటి, దవడలు, కాళ్లలో తిమ్మిరి ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిలో కొంత విశ్రాంతి తీసుకున్న తర్వాత ఈ తిమ్మిర్లు వాటంతట అవే నయమవుతాయి. కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు చర్మం రంగు పసుపు లేదా నీలం రంగులో కనిపించడం ప్రారంభమవుతుంది. చేతులు, కాళ్ళ గోర్లు మందగించడం కూడా కొలెస్ట్రాల్ స్థాయిని పెరిగిందనడానికి సంకేతం. అందువల్ల, వాటిని సకాలంలో గమనించాల్సిన అవసరం ఉంది.
పాదాల్లో తిమ్మిరి: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి చాలా పెరిగినప్పుడు. అప్పుడు పాదాలకు రక్తప్రసరణ సరిగా అందదు. ఈ కారణంగా, కొన్నిసార్లు మీ పాదాలు మొద్దుబారడం ప్రారంభమవుతుంది. ఇలా జరిగినప్పుడల్లా, పాదాలలో జలదరింపు, వణుకు లాంటివి కూడా కనిపిస్తాయి. కావున దీనిని నిర్లక్ష్యం చేయకుండా ఉండండి.
శరీర ఉష్ణోగ్రతలో వ్యత్యాసం: శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడల్లా, ఒక కాలు ఉష్ణోగ్రత, మరొక కాలు కంటే ఎక్కువగా లేదా తక్కువగా ఉండవచ్చు. ఇది కాకుండా రక్త నాళాలలో కొలెస్ట్రాల్ కారణంగా ఫలకం పేరుకుపోయినప్పుడు, రక్త ప్రసరణ మందగిస్తుంది. దీంతో కాళ్లకు రక్తం అందక సమస్య వస్తుంది. దీని వల్ల చాలా సార్లు పాదాల ఉష్ణోగ్రత తగ్గి చల్లగా మారడం మొదలవుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి