Bad Breath: నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా..? ఇలా సింపుల్‌గా వదిలించుకోవచ్చు.. ట్రై చేయండి..
వ్యక్తిగత ఆరోగ్యం చాలా ముఖ్యం.. అయితే, చాలామంది నోటి నుంచి దుర్వాసన వస్తుంటుంది. నోటి దుర్వాసన వల్ల మనకు మంచి అనుభూతి లభించదు.. దీనివల్ల మన చుట్టూ ఉన్న వ్యక్తులు ఇబ్బంది పడుతుంటారు.

వ్యక్తిగత ఆరోగ్యం చాలా ముఖ్యం.. అయితే, చాలామంది నోటి నుంచి దుర్వాసన వస్తుంటుంది. నోటి దుర్వాసన వల్ల మనకు మంచి అనుభూతి లభించదు.. దీనివల్ల మన చుట్టూ ఉన్న వ్యక్తులు ఇబ్బంది పడుతుంటారు. మనం బహిరంగ ప్రదేశానికి వెళ్లినప్పుడల్లా లేదా సమావేశానికి హాజరైనప్పుడల్లా, స్నేహితులు, పొరుగువారు, సహోద్యోగులు దుర్వాసన గురించి ఫిర్యాదు చేయడం ప్రారంభిస్తారు. మన దగ్గర చెప్పకపోయినా.. ఇతరుల దగ్గర ఇలాంటి విషయాలను ప్రస్తావిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో మనం చాలా ఇబ్బంది, తక్కువ విశ్వాసాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. సాధారణంగా ఇది మనం నోటిని శుభ్రం చేయకపోవడం, బ్యాక్టీరియా లోపల పేరుకుపోవడం వల్ల కనిపిస్తుంది. దంతాల కుహరం లేదా చిగుళ్లకు సంబంధించిన సమస్య ఉంటే అది కూడా దుర్వాసనకు కారణమవుతుంది. కొందరిలో పైయోరియా వల్ల కూడా వస్తుంది. అయితే, నోటి దుర్వాసనను పోగొట్టే ఇంటి నివారణలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
వీటి సహాయంతో నోటి దుర్వాసనను వదిలించుకోవచ్చు..
పటిక: నోటి దుర్వాసన వల్ల ఇతరులు సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు.. దీని కోసం పటిక సహాయం తీసుకోవచ్చు. ఒక గ్లాసు నీటిలో పటికను వేసి ఇరవై నిమిషాలు అలాగే ఉంచండి. ఆతర్వాత కాటన్ క్లాత్‌తో నీటిని ఫిల్టర్ చేసి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ప్రతిరోజూ ఉదయం పళ్ళు తోముకున్న తర్వాత ఈ నీటితో పుక్కిలించాలి. దీనితో మీరు ఆశించిన ఫలితాన్ని పొందవచ్చు.
బేకింగ్ సోడా: బేకింగ్ సోడా సాధారణంగా పలు ఆహార పదార్థాలలో ఉపయోగిస్తారు. అయితే, నోటి దుర్వాసన పోవాలనుకుంటే.. ఒక గ్లాసు నీటిలో అర టీస్పూన్ బేకింగ్ పౌడర్ కలపాలి. దీనితో రోజుకు కనీసం 2 సార్లు శుభ్రం చేసుకోండి. దీని ప్రభావం వెంటనే కనిపిస్తుంది.




లవంగం: మసాలా దినుసు లవంగాన్ని మన అనేక వంటల్లో ఉపయోగిస్తారు. ఇది చాలా సుగంధంగా ఉంటుంది. అలాగే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది నోటి దుర్వాసనను వదిలించుకోవడానికి బాగా సహాయపడుతుంది. మీరు మీ శ్వాసను తాజాగా చేయడానికి పచ్చి లవంగాలను నమలవచ్చు. కావాలనుకుంటే ఉదయం బ్రష్ చేసిన తర్వాత లవంగాలతో తయారు చేసిన టీని త్రాగాలి. దీని కోసం, ఒక పాత్రలో నీరు, లవంగాల పొడిని కలిపి సుమారు 15 నిమిషాలు ఉడకబెట్టి తాగొచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం..




