Health Tips: వర్షాకాలంలో స్నానం చేయడానికి బద్ధకిస్తున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు

|

Jul 31, 2022 | 11:23 AM

Monsoon Health Tips: చలికాలం, వర్షాకాలంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. నిద్రలేవడంతో పాటు ఏదైనా పనిచేయాలంటే చాలా బద్ధకంగా అనిపిస్తుంది. ముఖ్యంగా చాలామంది స్నానం చేయడానికి బాగా బద్ధకిస్తుంటారు.

Health Tips: వర్షాకాలంలో స్నానం చేయడానికి బద్ధకిస్తున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు
Skipping Bath
Follow us on

Monsoon Health Tips: చలికాలం, వర్షాకాలంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. నిద్రలేవడంతో పాటు ఏదైనా పనిచేయాలంటే చాలా బద్ధకంగా అనిపిస్తుంది. ముఖ్యంగా చాలామంది స్నానం చేయడానికి బాగా బద్ధకిస్తుంటారు. కొంతమందైతే గోరువెచ్చని నీళ్లు అందుబాటులో ఉన్నా కూడా స్నానం చేయడానికి ఇష్టపడరు. కారణం అడిగితే చల్లటి వాతావరణమని చల్లగా జారుకుంటారు. పైగా చెమట కూడా ఎక్కువగా రాదు కాబట్టి ఏం కాదులే అంటుంటారు. అయితే చలికాలంలో కంటే వర్షాకాలంలో స్నానం చేయకపోతే పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇన్ఫెక్షన్లు

వర్షాకాలంలో స్నానం చేయడం మానేస్తే చర్మంలో మృతకణాలు పేరుకుపోతాయి. క్రమంగా ఈ మృతకణాలు ఈస్ట్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. ఇవి శరీరంలోని ఇతర భాగాలకు మరింత వ్యాప్తి చెందుతాయి. ఫలితంగా పలు చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.

ఇవి కూడా చదవండి

చెడువాసన

స్నానం చేయకపోవడం వల్ల బ్యాక్టీరియా శరీరం అంతటా వ్యాపించి దుర్వాసన వస్తుంది. ఇది కూడా వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

ఇమ్యూనిటీపై ప్రభావం

స్నానం చేయకపోవడం వల్ల శరీరంలో వైరస్, బ్యాక్టీరియా బాగా వృద్ధి చెందుతాయి. ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని మరింత తగ్గిస్తాయి. ఫలితంగా పలు ఇన్ఫెక్షన్లు, ఆరోగ్య సమస్యలు తీవ్ర ఇబ్బంది కలిగిస్తాయి.

జుట్టురాలడం

ఇతర సీజన్లతో పోల్చుకుంటే వర్షాకాలంలో జుట్టు సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా హెయిర్ లాస్ బాగా ఉంటుంది. ఇక వర్షంలో తడిచి.. ఇంటికి వచ్చి తలస్నానం చేయకుంటే.. ఈ సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. పైగా స్కాల్ప్​పై దురద వంటి సమస్యలు వస్తాయి.

చర్మ సమస్యలు

వర్షాకాలంలో స్నానం మానేస్తే.. చర్మవ్యాధులు, సీజనల్ వ్యాధులు బాగా ఇబ్బంది పెడతాయి. కొన్ని సందర్భాల్లో ఇవి తీవ్రమైన చర్మ వ్యాధులకు దారి తీస్తాయి.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం క్లిక్ చేయండి..