Safe From Dengue: వర్షాకాలంలో డెంగ్యూ నుంచి ఇలా సురక్షితంగా ఉండండి.. తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు..

|

Jul 13, 2023 | 3:43 PM

వర్షాకాలం మొదలైంది. వర్షాల కారణంగా పరిసరాలన్నీ బురదమయం అవుతున్నాయి. తద్వారా వ్యాధులు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా నిల్వ ఉన్న నీటి కారణంగా దోమల వ్యాప్తి పెరిగి, డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందుకే వర్షకాలంలో డెంగ్యూ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

Safe From Dengue: వర్షాకాలంలో డెంగ్యూ నుంచి ఇలా సురక్షితంగా ఉండండి.. తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు..
Dengue
Follow us on

వర్షాకాలం మొదలైంది. వర్షాల కారణంగా పరిసరాలన్నీ బురదమయం అవుతున్నాయి. తద్వారా వ్యాధులు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా నిల్వ ఉన్న నీటి కారణంగా దోమల వ్యాప్తి పెరిగి, డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందుకే వర్షకాలంలో డెంగ్యూ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో 136 డెంగ్యూ కేసులు వెలుగు చూశాయి. క్రమంగా దేశ వ్యాప్తంగానూ ఈ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ముందస్తు లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి, అవసరమైన చికిత్స తీసుకోవాలి.

ఈ డెండ్యూ ఏడిస్ ఈజిప్టి అనే ఆడ దోమ కాటు కారణంగా సంక్రమిస్తుంది. ఈ డెంగ్యూ జ్వరానికి రెండు రూపాలు ఉన్నాయి. ఒకటి క్లాసికల్ డెంగ్యూ. దీనిని ‘బ్రేక్ బోన్’ ఫీవర్ అని కూడా పిలుస్తారు. మరోకటి డెంగ్యూ హెరేజిక్ ఫీవర్(DHF) అంటారు. ఇది ప్రాణంతకం. అయితే, డెంగ్యూ ముందస్తు లక్షణాలు 5 నుంచి 6 రోజుల తర్వాత కనిపిస్తాయి. ఈ లక్షణాల్లో ముందుగా ఆకస్మిక జ్వరం, కళ్లలో నొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, తీవ్రమైన తలనొప్పి, పొత్తి కడుపు నిండుగా, అసౌకర్యంగా ఉంటుంది. ఇక 5వ రోజున ఎర్రటి మచ్చలతో చర్మంపై దద్దుర్లు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.

డెంగ్యూ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?

దోమలు కరవకుండా ఉండేందుకు చర్మంపై రిపెల్లెంట్‌ను ఉపయోగించాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే, ఫుల్ స్లీవ్ డ్రెస్సులను వేసుకోవాలి. లేత గోధుమరంగు, లేద బూడిద రంగులో ఉండే దస్తులును, శ్వాసక్రియకు అనుకూలమైన దుస్తులను ధరించాలి. ఇంట్లో, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. నీటి కంటైనర్లను తొలగించడం, తలుపు, కిటికీ తెరలను మూసివేయడం చేయాలి. దోమలు వృద్ధి చెందే అవకాశం ఉన్న ప్రదేశాలను శుభ్రం చేయాలి. లేదంటా అలాంటి ప్రదేశాల్లో నివసించకుండా వేరే ప్రాంతాలకు వెళ్లాలి. దోమకాటుకు గురవకుండా దుస్తులను నిండుగా ధరించాలి. ఇక హైడ్రేట్‌గా ఉండటానికి ఎక్కువగా నీరు తాగాలి. విశ్రాంతి తీసుకోవాలి. ఒకవేళ మీలో డెంగ్యూ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకుని, అవసరమైన చికిత్స తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..