Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ ఆహార పదార్థాలను దూరం పెట్టాల్సిందే.. లేకుంటే ఈ సమస్యలు తప్పవు

|

Jul 21, 2022 | 9:22 AM

Health Tips: దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక రెండు రాష్ట్రాల్లో అయితే వానలు దంచికొడుతున్నాయి.ఈక్రమంలోనే చల్లటి వాతావారణంలో చినుకులు పడుతూ ఉంటే టీ, బజ్జీలు, పకోడీలు, ఫ్రైడ్‌ ఫుడ్స్‌, చిప్స్‌ వంటి ఆహార పదార్థాలను తింటే ఉండే మజా వేరు..

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ ఆహార పదార్థాలను దూరం పెట్టాల్సిందే.. లేకుంటే ఈ సమస్యలు తప్పవు
Monsoon Health Tips
Follow us on

Health Tips: దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక రెండు రాష్ట్రాల్లో అయితే వానలు దంచికొడుతున్నాయి.ఈక్రమంలోనే చల్లటి వాతావారణంలో చినుకులు పడుతూ ఉంటే టీ, బజ్జీలు, పకోడీలు, ఫ్రైడ్‌ ఫుడ్స్‌, చిప్స్‌ వంటి ఆహార పదార్థాలను తింటే ఉండే మజా వేరు. ఇక చాలా మంది ఈ సీజన్‌లో వెకేషన్లు, టూర్లు కూడా ప్రణాళికలు వేసుకుంటారు. అయితే ఇతర సీజన్లతో పోల్చుకుంటే వర్షాకాలంలో ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులు ఎక్కువగా వెంటాడుతాయి. ఈక్రమంలో వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధుల బారి నుంచి రక్షణ పొందాలంటే ఆహారంలో మార్పులు చేసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్ని ఆహారపదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవడంతో పాటు మరికొన్నింటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం రండి

ఆకు కూరలు
మనం సాధారణంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఆకు కూరలు బాగా తినమని సలహా ఇస్తారు నిపుణులు. వీటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అయితే వర్షాకాలంలో ఈ ఆకు కూరలను పరిమిత సంఖ్యలో తీసుకోవాలి. వర్షాకాలంలో ఈ కూరగాయల్లో క్రిములు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. కాబట్టి వాటిని తక్కువగా డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో బచ్చలికూర, క్యాబేజీ కాలీఫ్లవర్ మొదలైనవి జాబితాలో ఉన్నాయి. బెండకాయలు, క్యాబేజీలు తదితర కూరగాయలను కూడా వీలైనంత తక్కువగా తీసుకోవాలి. ఇవి ఉదర సంబంధిత సమస్యలను తెచ్చిపెడతాయి.

చేపలు

ఇవి కూడా చదవండి

వర్షాకాలంలో సీ ఫుడ్ తినకూడదు. ఇందులో చేపలు, రొయ్యలు మొదలైనవి ఉన్నాయి. ఇది వాటి సంతానోత్పత్తి కాలం. అందువల్ల, ఈ సీజన్లలో సీఫుడ్ తీసుకోకూడదు.

స్ట్రీట్‌ ఫుడ్‌

ఈ సీజన్‌లో స్ట్రీట్ ఫుడ్ తినకూడదు. గోల్ గప్పాలు, కచోరీలు, సమోసాలు మొదలైన వాటికి దూరంగా ఉండాలి. ఈ ఫుడ్స్‌ సాధారణంగా బహిరంగ ప్రదేశాల్లోనే విక్రయిస్తారు. దుమ్ము, కాలుష్యం కారణంగా అవి చాలా త్వరగా పాడైపోతాయి. పైగా ఈ సీజన్‌లో బ్యాక్టీరియా, కీటకాల కూడా ఎక్కువే. ఫలితంగా ఈ స్ట్రీట్‌ ఫుడ్స్‌ను తీసుకుంటే ఉదర సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. మలబద్ధకం, ఉబ్బరం, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి.

చల్లటి పదార్థాలు..

ఈ సీజన్‌లో ఐస్‌క్రీమ్‌, జ్యూస్‌లు, పులుపు పదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదు. వీటి కారణంగా గొంతు నొప్పి తదితర సమస్యలు కలుగుతాయి.

మాంస పదార్థాలు..

వర్షాకాలంలో నాన్‌వెజ్‌కు వీలైనంత దూరంగా ఉండాలి. వాతావరణంలోని తేమ, కలుషిత నీటి కారణంగా మాంసం త్వరగా చెడిపోతుంది. అందువల్ల వీటిని దూరంగా ఉంచడం మంచిది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..