Skin Care Tips: జిడ్డు చర్మానికి ” నేచురల్ ఫేస్ ప్యాక్”.. ఇంట్లోనే తయారు చేసుకోండి.. ఎలానంటే..

యువతలో జిడ్డు చర్మం ఎక్కువగా ఉంటుంది. ఆయిల్ స్కిన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే చర్మంపై  మొటిమల సమస్య మొదలవుతుంది. జిడ్డుగల చర్మాన్ని రోజువారీ..

Skin Care Tips: జిడ్డు చర్మానికి  నేచురల్ ఫేస్ ప్యాక్.. ఇంట్లోనే తయారు చేసుకోండి.. ఎలానంటే..
Skin Care Tips
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 21, 2022 | 11:37 AM

జిడ్డు చర్మం ఉన్నవారు తమ చర్మాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వేసవి కాలంలో జిడ్డు చర్మం ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. జిడ్డు చర్మానికి కారణమయ్యే అనేక కారణాలు ఉన్నాయి. ఆహారంలో ఎక్కువ కొవ్వు తీసుకోవడం. హార్మోన్ల హెచ్చుతగ్గులు, ఒత్తిడి కారణంగా చర్మం జిడ్డుగా ఉంటుంది. యువతలో జిడ్డు చర్మం ఎక్కువగా ఉంటుంది. ఆయిల్ స్కిన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే చర్మంపై  మొటిమల సమస్య మొదలవుతుంది. జిడ్డుగల చర్మాన్ని రోజువారీ శుభ్రపరచడం చాలా ముఖ్యం. జిడ్డు చర్మం ఉన్నవారు చర్మాన్ని శుభ్రం చేయడానికి క్లెన్సర్‌ని ఉపయోగిస్తారు. క్లెన్సర్ చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. చర్మంపై మొటిమలు, దుమ్మును కూడా తొలగిస్తుంది. మార్కెట్‌లో లభించే కెమికల్ బేస్ క్లెన్సర్‌లను చర్మంపై ఉపయోగించడం వల్ల దుష్ప్రభావాలు వచ్చే ప్రమాదం కూడా ఉంది.

మీరు జిడ్డుగల చర్మం అయితే మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి ఇంట్లోనే మిల్క్ క్లెన్సర్‌ను సిద్ధం చేసుకోండి. ఇంట్లోనే మిల్క్ క్లెన్సర్‌ని ఎలా తయారు చేసుకోవాలో.. చర్మానికి దాని వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.

మిల్క్ క్లెన్సర్ వల్ల స్కిన్ బెనిఫిట్స్: చర్మానికి మంచి క్లెన్సర్‌లలో పాలు ఒకటి. విటమిన్ ఎ,విటమిన్ కె పాలలో ఉంటాయి. పాలు ముఖంపై పేరుకున్న దుమ్ము, ధూళిని సులభంగా తొలగిస్తుంది. వేసవిలో, జిడ్డు చర్మంపై మురికిని తొలగించి. చర్మం మెరిసేలా చేయడానికి మిల్క్ క్లెన్సర్‌ని ఉపయోగించండి. దీన్ని ఉపయోగించడం వల్ల చర్మం మెరుస్తూ, మృదువుగా ఉంటుంది. పాలలో ఉండే ఎంజైమ్‌లు ముఖాన్ని శుభ్రపరుస్తాయి. టోన్, చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తాయి.

ఇవి కూడా చదవండి

మిల్క్ క్లెన్సర్‌ను ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..

కావల్సినవి..:

  • 3-4 స్పూన్ పచ్చి పాలు,
  • ఒక టీస్పూన్ నారింజ తొక్క పొడి
  • కాటన్ బౌల్

క్లెన్సర్ తయారు చేసే విధానం: పాలు, నారింజ తొక్కను క్లెన్సర్ చేయడానికి ముందుగా ఒక గిన్నెలో 3-4 చెంచాల పచ్చి పాలను తీసుకోండి. నారింజ తొక్కలను 2-3 రోజులు ఎండలో ఉంచి ఆరబెట్టి, మిక్సీలో గ్రైండ్ చేసి దాని పొడిని సిద్ధం చేసుకోండి. ఇప్పుడు పాలలో ఒక చెంచా నారింజ తొక్క పొడిని కలపండి. ఈ పేస్ట్‌ని బాగా కలపండి. మీ ఫేస్ క్లెన్సర్ సిద్ధంగా ఉంది. ఈ పేస్ట్‌ను ప్రతిరోజూ మీ ముఖంపై క్లెన్సర్‌గా వాడండి, మీ ముఖం శుభ్రంగా ఉంటుంది. మీరు ముఖ మొటిమలను తొలగిస్తారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

ఫ్యాషన్ న్యూస్ కోసం..