AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సైలెంట్ కిల్లర్.. అతిగా ఆలోచించడం వల్ల శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?

నేటి బిజీ లైఫ్‌లో మనందరం ఏదో ఒక దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. పనికి సంబంధించిన సమస్యలు కావచ్చు.. సంబంధాలలో గందరగోళం కావచ్చు లేదా భవిష్యత్తు గురించి ఆందోళనలు కావచ్చు.. ఇవన్నీ మళ్లీ మళ్లీ ఆలోచించడం ద్వారా మనకు తెలియకుండానే మన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటాము..

సైలెంట్ కిల్లర్.. అతిగా ఆలోచించడం వల్ల శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
Overthinking
Shaik Madar Saheb
|

Updated on: Oct 06, 2024 | 11:48 AM

Share

నేటి బిజీ లైఫ్‌లో మనందరం ఏదో ఒక దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. పనికి సంబంధించిన సమస్యలు కావచ్చు.. సంబంధాలలో గందరగోళం కావచ్చు లేదా భవిష్యత్తు గురించి ఆందోళనలు కావచ్చు.. ఇవన్నీ మళ్లీ మళ్లీ ఆలోచించడం ద్వారా మనకు తెలియకుండానే మన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటాము.. ఈ పరిస్థితిని ‘అతిగా ఆలోచించడం’ (Overthinking) అంటారు.. ఇది మానసిక ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి సమస్యలకు దారితీస్తుంది.

అతిగా ఆలోచించడం మీ మానసిక ఆరోగ్యానికే కాకుండా మీ శారీరక ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తుంది. నిరంతరం ఆందోళన చెందడం వల్ల నిద్రలేమి, తలనొప్పి, అధిక రక్తపోటు, ఇతర శారీరక సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీరు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండేందుకు అతిగా ఆలోచించకుండా ఒక మార్గాన్ని కనుగొనడం.. లేదా దానిని పరిష్కరించడం చాలా ముఖ్యమంటున్నారు వైద్య నిపుణులు..

వాస్తవానికి ఆలోచన విధానాన్ని కట్టడి చేయడం అంత సులభం ఏం కాదు.. ఎందుకంటే.. ఎవరికైనా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది.. ఒకటి పరిష్కారం అయితే.. మరొక కొత్త సమస్య వస్తూనే ఉంటుంది.. అందుకే.. ఓవర్ థింకింగ్.. ఒత్తిడిని జయించేందుకు మార్గాలను అన్వేషించడం మంచిది..

అతిగా ఆలోచించడాన్ని ఎలా గుర్తించాలి?

అతిగా ఆలోచించడాన్ని గుర్తించడం అంత కష్టమేమి కాదు. మీరు ఏదైనా సంఘటన, సమస్య లేదా పరిస్థితి గురించి పదే పదే ఆలోచిస్తే, దాని పరిష్కారాన్ని కనుగొనే బదులు.. మీరు దానిలో చిక్కుకుపోతారు.. సింపుల్ గా చెప్పాలంటే మీరు అతిగా ఆలోచించడానికి బలిపశువు కావొచ్చు.. ఇది కాకుండా, మీరు చిన్న చిన్న విషయాల గురించి ఆందోళన చెందుతుంటే.. అవి మీ రోజువారీ జీవితంలో జోక్యం అవుతుంటే.. ఇది కూడా అతిగా ఆలోచించే లక్షణం కావచ్చు. ఒక విషయాన్ని పదే పదే గుర్తుచేసుకోవడం.. భవిష్యత్తు గురించి ఏదో ఊహించుకోవడం.. ఏదైనా సమస్య వస్తుందని ముందే ఊహించడం.. దానికి ఏదో ఒక విషయంతో ముడిపెట్టి.. ఆలోచించడం. ఇవన్నీ అతిగా ఆలోచించడం లక్షణాలే..

ఓవర్ థింకింగ్ అధిగమించడానికి మార్గాలు..

ధ్యానం సహాయం తీసుకోండి: అతిగా ఆలోచించకుండా ఉండటానికి ధ్యానం ఒక ప్రభావవంతమైన మార్గం. రోజూ 10 నుండి 15 నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రతికూల ఆలోచనల నుంచి బయటపడటానికి సహాయపడుతుంది.

వర్తమానంపై దృష్టి పెట్టండి: తరచుగా మనం భవిష్యత్తు గురించి చింతిస్తూ వర్తమానాన్ని ఆస్వాదించడం మరచిపోతాం. మీ జీవితంలోని ప్రస్తుత క్షణాలపై దృష్టి పెట్టండి.. ఎలాగా ఉండాలనుకుంటున్నారో.. అలా ఉండండి..

సానుకూల ఆలోచనను పెంపొందించుకోండి: అతిగా ఆలోచించడానికి ప్రతికూల ఆలోచనలు ప్రధాన కారణం. సానుకూలంగా ఆలోచించడానికి మీ మనస్సుకు శిక్షణ ఇవ్వండి.. మీరు పోరాడుతున్న సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టండి.

సమస్యల గురించి పదే పదే ఆలోచించే బదులు, వాటిని పరిష్కరించడానికి ఒక నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను రూపొందించండి.. దానిపై పని చేయండి.. ప్రస్తుత క్షణాలపై దృష్టిపెట్టండి.. ఇలా జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ.. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు..

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..