
Health Tips: భారతదేశంలోని ఏ మూలకు వెళ్లినా దాదాపు ప్రతి ఇంట్లో ఊరగాయ జాడీలు కనిపిస్తాయి. ఇది ఆహారం రుచిని మరింత పెంచుతుంది. ఊరగాయని ఇంట్లోనే తయారు చేస్తారు. ఇది కొంతమందికి ఇష్టముండదు. కానీ కొన్ని పరిస్థితుల్లో తినకుండా ఉండలేరు. అయితే పులుపు యువకులు, వివాహితులైన పురుషులకు ఎక్కువ హాని చేస్తుది. అది ఎలాగో తెలుసుకుందాం. ఊరగాయ మసాలా రుచి అందరిని ఆకట్టుకుంటుంది. కానీ దీని తయారీలో చాలా నూనెను ఉపయోగిస్తారు. అలాగే సూర్యరశ్మి సరిగా పడకపోతే అందులో వాడే మసాలాలు పచ్చిగా ఉంటాయి. ఈ 2 కారణాల వల్ల అధిక కొలెస్ట్రాల్, జీర్ణక్రియ సమస్య ఉంటుంది. అలాగే పురుషుల లైంగిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది.
ఏదైనా అతిగా తినడం శరీరానికి హానికరం. ఈ పరిస్థితిలో వివాహిత పురుషులు ఎక్కువగా ఊరగాయ తీసుకుంటే దాని పులుపు పురుషుల సంతానోత్పత్తిపై చెడు ప్రభావాన్ని చూపుతుందని తేలింది. ఇది వివాహ జీవితం ఆనందాన్ని ముగించడమే కాకుండా తండ్రిగా మారడంలో సమస్యలని సృష్టిస్తుంది. ఈ సమస్యలను నివారించడానికి మీరు పరిమిత పరిమాణంలో ఊరగాయలను తీసుకోవాలి. వీలైతే ఇంట్లో ఊరగాయ తయారుచేసేటప్పుడు అందులో తక్కువ నూనె, తక్కువ మసాలా దినుసులు వాడండి. గాజు పాత్రలో నిల్వ చేయండి. పచ్చిమిర్చిని బాగా ఎండనివ్వండి. సాధారణంగా ప్రజలు మార్కెట్ నుంచి ఊరగాయలను కొనుగోలు చేస్తారు. వీటి తయారీలో పరిశుభ్రత గురించి పట్టించుకోరు. అంతేకాదు ఇందులో ఉప్పు ఎక్కువగా వినియోగిస్తారు.
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి