Health: అప్పుడే పుట్టిన చిన్నారుల్లో థైరాయిడ్‌ సమస్య.. పరిశోధనల్లో షాకింగ్ విషయాలు..

Health: ఇటీవల చాలా మంది థైరాయిడ్‌ (Thyroid) సమస్యతో బాధపడుతున్నారు. మారుతోన్న జీవన విధానం (Life Style). తీసుకుంటున్న ఆహారంలో నాణ్యత తగ్గడం వంటి కారణాల వల్ల థైరాయిడ్‌ హార్మాన్‌ విడుదలలో...

Health: అప్పుడే పుట్టిన చిన్నారుల్లో థైరాయిడ్‌ సమస్య.. పరిశోధనల్లో షాకింగ్ విషయాలు..
Follow us

| Edited By: Surya Kala

Updated on: May 29, 2022 | 6:10 AM

Health: ఇటీవల చాలా మంది థైరాయిడ్‌ (Thyroid) సమస్యతో బాధపడుతున్నారు. మారుతోన్న జీవన విధానం (Life Style). తీసుకుంటున్న ఆహారంలో నాణ్యత తగ్గడం వంటి కారణాల వల్ల థైరాయిడ్‌ హార్మాన్‌ విడుదలలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సాధారణంగా థైరాయిడ్ హార్మోన్‌ సక్రమంగా విడుదలైనప్పుడే శరీరంలో ప్రతి కణం సరిగ్గా పనిచేసి, జీవక్రియ పనితీరు బాగుంటుంది. థైరాయిడ్‌ విడుదలలో సమతుల్యం లోపిస్తే సమస్యలు తప్పవు. అయితే సాధారణంగా ఇప్పటి వరకు థైరాయిడ్‌ లోపం పెద్దవారిలో మాత్రమే కనిపించేది. కానీ ప్రస్తుతం నవజాత శిశువుల్లోనూ థైరాయిడ్‌ సమస్యలను వైద్యులు గుర్తిస్తున్నారు. ఇది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు చెబుతున్నారు.

నోయిడాలోని పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చైల్డ్‌ హెల్త్‌కు చెందిన నియోనాటాలజీ విభాగం వారు చేసిన అధ్యయనాల్లో కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. అప్పుడే పుట్టిన కొందరు చిన్నారుల్లో థైరాయిడ్‌ అసమతుల్యతను గుర్తించారు. ఈ వివరాలను ‘ఆర్క్కైవ్స్‌ ఆఫ్‌ ఎండోక్రినాలజీ అండ్‌ మెటబాలిజం’ జర్నల్‌లో ప్రచురించనున్నారు. ఈ అధ్యయనంలో భాగంగా నెలలు నిండని చిన్నారులతో పాటు, నెలలు నిండి జన్మించిన 200 మంది శిశువులను పరిగణలోకి తీసుకున్నారు. జన్మించినప్పుడు వీరిలో కొందరు ఆరోగ్యంగా ఉన్నా, వారిని నియోనాటల్‌ ఐసీయూలో చేర్చాల్సి వచ్చింది. ఈ చిన్నారుల్లో థైరాయిడ్‌ లోపం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

న్యూఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రికి చెందిన ఇంటర్నల్‌ మెడిసిన్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ సురంజిత్‌ ఛటర్జీ ఈ విషయమై మాట్లాడుతూ.. ‘థైరాయిడ్‌ అసమతుల్యత’పై చాలా మందికి అవగాహన ఉండే ఉంటుంది. థైరాయిడ్‌ హార్మోన్‌ విడుదలలో వచ్చే హెచ్చుతగ్గుల ఆధారంగా హైపో లేదా హైపర్‌ థైరాయిడిజంగా పిలస్తుంటారు. ధైరాయిడ్‌ గ్రంథి సక్రమంగా పనేయకపోవడం వల్ల జీవక్రియపై ప్రభాం చూపుతుంది. థైరాయిడ్ అసమతుల్యత కారణంగా కొందరు సన్నగా మారితే మరికొందరు లావుగా మారుతారు’ అని ఆమె వివరించారు. అయితే నవజాత శిశువుల్లో థైరాయిడ్‌ రావడం ఇక్కడ ఆలోచించాల్సిన అంశంగా చెప్పొచ్చన్నారు. నవజాత శిశువుల్లో 10 శాతం మందికి థైరాయిడ్‌ హార్మోన్‌ లోపం ఉన్నట్లు ఆమె తెలిపారు.

ఇవి కూడా చదవండి

నవజాత శిశువుల్లో థైరాయిడ్‌ స్థాయిలు తగ్గడానికి థైరాయిడ్‌ డైషోర్మోనోజెనిసిస్‌ ఒక ముఖ్యమైన కారణమని నోయిడాలోని ఫోర్టిస్‌ హాస్పిటల్‌కు చెందిన సీనియర్‌ కన్సల్టెంట్‌ పీడియాట్రిషన్‌ డాక్టర్‌ అలోక్‌ ద్వివేది తెలిపారు. హార్మోన్ల అసమతులత్య ఉన్న నవజాత శిశువుల్లో ఎక్కువ మంది థైరాయిడ్‌ గ్రంథి లేకుండానే జన్మిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. థైరాయిడ్ లోపంతో జన్మించిన చిన్నారులకు వెంటనే థైరాయిడ్‌ హార్మోన్‌ రీస్లేస్‌మెంట్‌ థెరపీని తీసుకోకపోతే భవిష్యత్తులో శిశువులకు మెంటల్‌ రిటార్డేషన్‌ వచ్చే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. వీలైనంత త్వరగా సమస్యను గుర్తించి చికిత్స చేస్తే ప్రమాదం నుంచి బయటపడొచ్చని ద్వివేది సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి..