Men Health: మగాళ్లూ బీ అలర్ట్.. బిజీ లైఫ్‌లో ఇవి మామూలే.. కానీ కొంపలు ఆర్పేస్తాయ్..

|

Sep 14, 2022 | 6:33 AM

Men Health: మగవారిలో వంధ్యత్వానికి సంబంధించిన కేసులు, అంటే తండ్రి కాలేకపోవడం వంటి సమస్యలు ప్రస్తుత రోజుల్లో చాలా ఎక్కువయ్యాయి.

Men Health: మగాళ్లూ బీ అలర్ట్.. బిజీ లైఫ్‌లో ఇవి మామూలే.. కానీ కొంపలు ఆర్పేస్తాయ్..
Men Health Main
Follow us on

Men Health: మగవారిలో వంధ్యత్వానికి సంబంధించిన కేసులు, అంటే తండ్రి కాలేకపోవడం వంటి సమస్యలు ప్రస్తుత రోజుల్లో చాలా ఎక్కువయ్యాయి. స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ నాణ్యత ప్రభావితం అయినప్పుడు ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యకు చికిత్స తీసుకోవచ్చు. కానీ, ఈ సమస్య కారణంగా వ్యక్తి మానసికంగా, శారీరకంగా చాలా క్రుంగిపోతారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మగవారిలో వంధ్యత్వం సమస్యలు వారి అలవాట్ల కారణంగానే వస్తుంది. ఆ అలవాట్లను మార్చుకుంటే.. ఈ సమస్య నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు. మరి ఆ చెడు అలవాట్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ అలవాట్లను నిత్య కృత్యంగా మార్చుకోవడం వలన.. సమస్య మరింత తీవ్రం అవుతోంది. రోటీన్ అలవాట్లు కావడంతో పొరపాట్లను కంటిన్యూ చేస్తున్నారు. అదికాస్తా వంధ్యత్వానికి దారి తీసి, సంతానలేమికి కారణం అవుతోంది. మరి ఈ సమస్య ఎలా తలెత్తుతుంది, ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అనేది ఇప్పుడు చూద్దాం.

చేసేది తప్పు అని తెలుసు.. అయినా..

ఎక్కువసేపు ఒకే చోట కూర్చుకోవడం వలన సమస్య మొదలవుతుంది. బిజీ లైఫ్, షెడ్యూల్ కారణంగా.. స్త్రీ లు గానీ, పురుషులు గానీ గంటల తరబడి ఒకే చోట కూర్చుని పని చేస్తుంటారు. ఇది సర్వసాధారణం. అయితే, దీని వచ్చే రిజల్ట్ తీవ్రమైన అనారోగ్య సమస్యలు. ఎక్కువసేపు ఒకే చోట కూర్చుకోవడం వలన పైల్స్ వంటి సమస్యలు కూడా వస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే, పురుషులు వంధ్యత్వానికి గురవుతారు. ఒక వ్యక్తి ఏదైనా కారణం చేత 6 గంటల పాటు ఒకే చోట నిరంతరం కూర్చుంటే.. అతని స్పెర్మ్ కౌంట్, నాణ్యతపై ప్రభావం చూపుతుందని ఒక పరిశోధనలో వెల్లడైంది. ఫలితంగా సంతానోత్పత్తిలో సమస్య తలెత్తుతుంది.

ఇలా చేయండి..

పురుషులు ప్రతి 1.5 గంటలకు, ప్రతి 2 గంటలకు కనీసం 15 నిమిషాల విరామం తీసుకోవాలని నివేదిక పేర్కొంది. ఈ విరామంలోనూ మళ్లీ కూర్చునే ప్రయత్నం చేయొద్దు. కాసేపు నడవాలి. ఇలా చేయడం ద్వారా శారీరకంగా దృఢంగా ఉంటారు. ఇంటి నుండి పని చేస్తున్నప్పటికీ 15 నిమిషాల విరామం తీసుకోవాలి. ఈ చర్య వలన అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మానసిక ఒత్తిడిని కూడా తగ్గించుకోవచ్చు.

ధ్యానం, యోగా చేయాలి..

పని మధ్య విరామం సమయంలో నడవకూడదనుకుంటే.. ధ్యానం కూడా చేయవచ్చు. ఎక్కడైనా ప్రశాంతంగా నిలబడి ధ్యానం చేయవచ్చు. ఇలా చేస్తున్నప్పుడు మీ మెదడులోకి వచ్చే ఆలోచనలన్నింటినీ త్యజంచండి. మనసును ప్రశాంతంగా ఉంచుకోండి.

(ఈ కథనంలో అందించిన సమాచారం ప్రజల సాధారణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని TV9 తెలుగు ధృవీకరించడంలేదు. ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..