Arjuna Fruit: అర్జున పండు గురించి మీరు ఎప్పుడైనా విన్నారా.. దీనిని ఆయుర్వేదంలో ఎక్కువగా వినియోగిస్తారు. ఈ పండులో చాలా ఔషధగుణాలు దాగి ఉన్నాయి. ఇది ఎన్నో ఆరోగ్య సమస్యలని నయం చేస్తుంది. అర్జున ఫలాన్ని ఆరోగ్యానికి ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. అర్జున పండులో ఉండే గుణాలో నోటి దుర్వాసనని పోగొడుతాయి. చిగుళ్ల సమస్య, పంటి నొప్పి, దంతాల రక్తస్రావాన్ని తగ్గిస్తుంది. ఈ చెట్టు బెరడు దంతాల సమస్యను తొలగించడంలో ఉపయోగపడుతుంది. తరచుగా కొంతమంది మూత్ర విసర్జనలో అడ్డంకి సమస్యను ఎదుర్కొంటారు. అర్జునుడి ఫలాన్ని తినడం ద్వారా ఈ సమస్య పరిష్కారమవుతుంది. ఇది మూత్ర నాళాల సమస్యలను తగ్గిస్తుంది. చర్మ సమస్యలను తొలగించడంలో అర్జున ఫలం ప్రభావవంతంగా పనిచేస్తుంది. అర్జున పండు పొడిని తయారు చేసి అందులో తేనె కలిపి చేసిన ఆ మిశ్రమాన్ని చర్మానికి పట్టించాలి. ఇలా చేయడం వల్ల మచ్చలేని చర్మం మాత్రమే కాదు. ముడతలు, మచ్చలు, మొటిమలు మొదలైన సమస్యలని తగ్గిస్తుంది.
అర్జున బెరడుని ఇతర మూలికలతో కలిపి తీసుకుంటే రక్తపోటు తగ్గుతుంది. పాలతో కలిపి అర్జున బెరడు తీసుకున్నప్పుడు అది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుందని శాస్త్రీయంగా నిరూపణ అయింది. ఇది లిపిడ్ పెరాక్సిడేషన్ నిరోధిస్తుంది. అర్జున బెరడు హృదయ సంబంధ సమస్యలను కూడా నిరోధిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. దగ్గును నివారిస్తుంది. పొట్టని క్లీన్ చేస్తుంది. అయితే క్లినికల్ అధ్యయనాలు లేకపోవటం వల్ల అర్జున బెరడు ప్రయోజనాలు ధృవీకరించలేదు.
భారతదేశంలో జన్మించిన అర్జున చెట్టు సాధారణంగా నదులు, ప్రవాహాల సమీపంలో దొరుకుతుంది. ఇది 25 నుంచి 30 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. అర్జున బెరడు నునుపుగా, బూడిద రంగులో ఉంటుంది. కానీ మధ్యలో కొన్ని ఆకుపచ్చ, ఎరుపు మచ్చలు కలిగి ఉంటుంది. అర్జున ఆకులు దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. మే నుంచి జూలై నెలల్లో ఈ చెట్టుకు తెల్లటి పుష్పాలు వికసిస్తాయి. అర్జున పండు పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చగా ఉంటుంది. పక్వానికి చేరినప్పుడు ముదురు గోధుమ రంగులోకి మారుతుంది.
గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.