ప్రధాని మోదీ 300 రోజులు తినే మఖానా ప్రత్యేకత ఏంటో తెలుసా..? మఖానా మీకూ అవసరమే..!

మఖానా లేదా ఫాక్స్‌నట్ అనేది ఆరోగ్యానికి చాలా మేలు చేసే ఒక సూపర్ ఫుడ్. ఇది సమతుల ఆహారానికి చక్కగా ఉంటుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. తాను సంవత్సరానికి 300 రోజులు మఖానా తింటానని చెప్పారు. బీహార్‌లో విరివిగా పండే ఈ సంప్రదాయ విత్తనాలను ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్రధాని మోదీ 300 రోజులు తినే మఖానా ప్రత్యేకత ఏంటో తెలుసా..? మఖానా మీకూ అవసరమే..!
Makhana The Superfood Loved By Narendra Modi

Updated on: Feb 26, 2025 | 1:21 PM

ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఇప్పుడు మఖానా దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో అల్పాహారంగా మారింది. నేను 365 రోజుల్లో కనీసం 300 రోజులు మఖానా తింటాను. ఇది ఒక సూపర్ ఫుడ్. దీన్ని అంతర్జాతీయ మార్కెట్‌కు తీసుకెళ్లాలి. అందుకే ఈ సంవత్సరపు బడ్జెట్‌లో మఖానా రైతుల అభివృద్ధికి ప్రత్యేకంగా మఖానా బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది అని చెప్పారు.

మఖానాలో పోషకాలు

మఖానాలో ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్ వంటి పోషకాలతో ఇది శరీరానికి అవసరమైన ఎనర్జీని అందిస్తుంది.

డయాబెటిస్

మఖానా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. మఖానా రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుందని పరిశోధనల్లో తేలింది.

అధిక బరువు

మఖానాలో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఎక్కువసేపు ఆకలి అనిపించకుండా చేస్తుంది. ఈ ఆహారం తక్కువ కేలరీలు కలిగి ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఉత్తమమైన ఎంపిక.

గుండె ఆరోగ్యం

మఖానాలో పొటాషియం శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

ఫ్రీ రాడికల్స్‌కు చెక్

మఖానాలో సహజసిద్ధమైన యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో, శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి. దీని వల్ల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.

మీ రోజువారీ ఆహారంలో మఖానాను చేర్చుకోవడం చాలా సులభం. చిరుతిండిగా నెయ్యిలో స్వల్పంగా వేయించి తినవచ్చు. డెజర్ట్‌లలో మఖానాను జోడించడం వల్ల వాటి పోషకవిలువ మరింత పెరుగుతుంది. సలాడ్‌లలో కలిపి మరింత ఆరోగ్యవంతమైన ఆహారంగా మార్చుకోవచ్చు.

ఇంట్లో తయారుచేసే ప్రోటీన్ బార్లు, ట్రయల్ మిక్స్‌లలో చేర్చడం వల్ల శక్తివంతమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందవచ్చు. అదనపు పోషకాలను పొందేందుకు మఖానాను స్మూతీల్లో కలిపి తీసుకోవచ్చు. ఇలా మఖానాను పలు విధాలుగా ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది.