Maharastra Covid Update : మహారాష్ట్రలో మరణ మృదంగం మోగిస్తున్న కరోనా..! టీకాల కొరతతో ఇబ్బందిపడుతున్న జనాలు..

|

Apr 10, 2021 | 5:32 AM

Maharastra Covid Update : మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ..

Maharastra Covid Update : మహారాష్ట్రలో మరణ మృదంగం మోగిస్తున్న కరోనా..! టీకాల కొరతతో ఇబ్బందిపడుతున్న జనాలు..
Brothers die with coronavirus
Follow us on

Maharastra Covid Update : మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 58, 993 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు 32,88,540 కు చేరుకున్నాయి. నిన్న 301 మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 57,329 కు చేరుకుంది. కాగా ఇప్పటి వరకు అత్యధిక మరణాలు కలిగిన రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది.

ఈ రోజు 26,95,148 మంది రోగులు కోలుకోవడంతో మహారాష్ట్రలో మొత్తం క్రియాశీల COVID-19 కేసులు 5,34,603కు తగ్గాయి. రాష్ట్ర రికవరీ రేటు ప్రస్తుతం 82.36 శాతంగా ఉంది. పూణే, ముంబై, నాగ్‌పూర్, థానే, ఔరంగాబాద్‌లలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మరణాల రేటు 1.79 శాతంగా ఉంది. కరోనా టీకాల కొరతతో ఇప్పటికే పలు వ్యాక్సిన్ కేంద్రాలు మూతపడుతుండగా.. మరికొన్ని చోట్ల ఆస్పత్రుల్లో పడకల కొరతతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత కొన్ని వారాలుగా భారీ సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో జనం తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

కొవిడ్‌ విజృంభణ రోజురోజుకీ పెరిగిపోతున్న వేళ ప్రభుత్వంలోని మంత్రుల నుంచే పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ పెట్టాలన్న ప్రతిపాదనలు వస్తున్నాయి. రాబోయే పండుగలను దృష్టిలో ఉంచుకొని కరోనా కట్టడే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించాలని తాను ప్రతిపాదించినట్టు మహారాష్ట్ర మంత్రి విజయ్‌ వడెట్టివార్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మరోసారి పూర్తి లాక్‌డౌన్‌ పెట్టే అంశంపై రేపు నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే నైట్ కర్ఫ్యూ , వారాంతపు లాక్‌డౌన్‌ విధించింది. కోవిడ్ వ్యాక్సిన్లు మరిన్ని స్టాక్స్ పంపమని కేంద్రాన్ని కోరినట్లు మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే తెలిపారు. ముంబై నగరంలో టీకా అందుబాటులో లేకపోవడంతో ప్రజలను తిరిగి పంపుతున్నారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు నిరంతరం పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

తొలిపోరులో బోణీ కొట్టిన కోహ్లీసేన.. చివరి బంతి వరకు ఉత్కంఠ.. ముంబై ఇండియన్స్‌పై బెంగుళూర్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ గెలుపు..

మీరు హైదరాబాద్‌లో ఉంటున్నారా..! అయితే తప్పకుండా ఈ విషయం తెలుసుకోండి.. లేదంటే మీ జేబు ఖాళీ అవుతుంది..

నిరుద్యోగులు అలర్ట్..! యూనివర్సిటీ పోస్టులకు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల వర్తింపు.. టీఎస్‌పీఎస్‌సీ తాజా నిర్ణయం..