Maharastra Covid Update : మహారాష్ట్రలో కరోనా విలయతాండవం.. ఒక్కరోజులో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?

|

Apr 11, 2021 | 6:23 AM

Maharastra Covid Update : దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా మరో 55,411 కరోనా కేసులు నమోదయ్యాయి.

Maharastra Covid Update : మహారాష్ట్రలో కరోనా విలయతాండవం.. ఒక్కరోజులో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?
Corona Positive
Follow us on

Maharastra Covid Update : దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా మరో 55,411 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో మహారాష్ట్రలో మరో 309 మంది కరోనాతో మృతి చెందారు. ఇక ఒక్కరోజే 53,005 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 33,43,951కి చేరింది.

రాష్ట్ర రికవరీ రేటు ప్రస్తుతం 82.36 శాతంగా ఉంది. పూణే, ముంబై, నాగ్‌పూర్, థానే, ఔరంగాబాద్‌లలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మరణాల రేటు 1.79 శాతంగా ఉంది. కరోనా టీకాల కొరతతో ఇప్పటికే పలు వ్యాక్సిన్ కేంద్రాలు మూతపడుతుండగా.. మరికొన్ని చోట్ల ఆస్పత్రుల్లో పడకల కొరతతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత కొన్ని వారాలుగా భారీ సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో జనం తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

కొవిడ్‌ విజృంభణ రోజురోజుకీ పెరిగిపోతున్న వేళ ప్రభుత్వంలోని మంత్రుల నుంచే పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ పెట్టాలన్న ప్రతిపాదనలు వస్తున్నాయి. రాబోయే పండుగలను దృష్టిలో ఉంచుకొని కరోనా కట్టడే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించాలని తాను ప్రతిపాదించినట్టు మహారాష్ట్ర మంత్రి విజయ్‌ వడెట్టివార్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మరోసారి పూర్తి లాక్‌డౌన్‌ పెట్టే అంశంపై సీఎం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే నైట్ కర్ఫ్యూ , వారాంతపు లాక్‌డౌన్‌ విధించింది. కోవిడ్ వ్యాక్సిన్లు మరిన్ని స్టాక్స్ పంపమని కేంద్రాన్ని కోరినట్లు మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే తెలిపారు. ముంబై నగరంలో టీకా అందుబాటులో లేకపోవడంతో ప్రజలను తిరిగి పంపుతున్నారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు నిరంతరం పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

Corona Lock Down: నిన్న బేగం బజార్‌ వ్యాపారస్తులు.. నేడు ఆటో మొబైల్‌ యూనియన్‌.. కరోనా నేపథ్యంలో రేపటి నుంచి..

గొంతు నొప్పితో ఇబ్బందా..? అయితే ఇలా చేయండి.. వెంటనే ఉపశమనం దొరుకుతుంది..

కొటక్‌ మహీంద్రా బంపర్‌ ఆఫర్..! ఖాతాదారులకు మరోసారి అవకాశం.. ఏంటో తెలుసుకోండి..