Diabetes: తక్కువ బరువు ఉన్నవారికి డయబెటిస్ వస్తుందా ? నిపుణులు చెప్తున్న విషయాలెంటీ..

|

Feb 18, 2021 | 8:59 PM

టైప్ -2 డయాబెటిస్ రావడానికి అనేక కారణాలుంటాయి. ఇది దీర్ఘకాలిక పరిస్థితి ఉంటుంది. దీనికి రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రణ అవసరం. డయబెటీస్ కంట్రోల్లో ఉండడానికి ఆరోగ్య పదార్థాల విషయంలో

Diabetes: తక్కువ బరువు ఉన్నవారికి డయబెటిస్ వస్తుందా ? నిపుణులు చెప్తున్న విషయాలెంటీ..
Follow us on

టైప్ -2 డయాబెటిస్ రావడానికి అనేక కారణాలుంటాయి. ఇది దీర్ఘకాలిక పరిస్థితి ఉంటుంది. దీనికి రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రణ అవసరం. డయబెటీస్ కంట్రోల్లో ఉండడానికి ఆరోగ్య పదార్థాల విషయంలో జాగ్రత్తలు అవసరం. సాధరణంగా అధిక బరువు ఉన్నవారిలో ఈ డయబెటీస్ చాలా ప్రమాదకరం. కుటుంబంలో పెద్దవారికి ఉండడం వలన కూడా ఇది క్రమంగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దీని గురించి ప్రముఖ నిపుణుడు ఏం అంటున్నాడో తెలుసుకుందాం.

డయాబెటిస్‎కు మరియు శరీర బరువు మధ్య సంబంధం..

డాక్టర్ వి మోహన్ డయాబెటిస్ పట్ల మనలో ఉన్న అపోహాలకు తన సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు. ” సాధారణంగా అధిక బరువు ఉన్నవారు లేదా డయాబెటిస్ యొక్క కుటుంబ చరిత్ర ఉన్నవారు మాత్రమే డయాబెటిస్‏తో బాధపడతారని నమ్ముతారు. పురాణం చాలా మందిలో డయాబెటిస్ నిర్ధారణను ఆలస్యం చేస్తుంది. మీకు డయాబెటిస్ యొక్క కుటుంబ చరిత్ర ఉంటే లేదా మీరు అధిక బరువుతో ఉంటే, అలాంటి వారికి ఎక్కువ ప్రమాదం ఉంటుంది. కానీ వీటికి మెడిసిన్ తీసుకుంటూ, ఆహార నియంత్రణ పాటించడం ముఖ్యం. అలాగే తక్కువ బరువు లేదా సహజ బరువు ఉన్నవారికి కూడా డయాబెటిస్ రావచ్చు” అని పేర్కోన్నారు.

డయాబెటిస్ నియంత్రించాలంటే ఏం చేయాలి…

సంవత్సరానికి ఒకసారి కచ్చితంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కుటుంబ పరంగా డయాబెటిస్ వస్తూ ఉంటూ.. ఆ కుటుంబంలోని 20 సంవత్సరాలు దాటిన వారు కచ్చితంగా డయాబెటిస్ చెక్ చేసుకోవాలి. అలాగే కుటుంబ పరంగా డయాబెటిస్ లేనివారు 30 ఏళ్ళు దాటిన తర్వాత చెక్ చేసుకోవాలి. లక్షణాలు కనిపించే వరకు వెయిట్ చేయడం సరైనది కాదు. అలాంటి వారికి ప్రమాదం లేకపోలేదు అని చెప్పలేం. ఈ సమస్య భారతీయులకు అధికంగా ఉంటుందని డాక్టర్ మోహన్ తెలిపారు. ప్రారంభంలోనే ఈ వ్యాధిని గుర్తిస్తే.. దానిని నియంత్రించేందుకు మార్గం ఉంటుందని తెలిపారు. ఒకవేళ మొదట్లో చెక్ చేసుకోకపోతే.. అది క్రమంగా పెరిగి తీవ్రతరమవుతుందని తెలిపారు.

కుటుంబ పరంగా అలాగే బరువు ఎక్కువగా ఉన్నవారి కంటే ఇతరులకు డయాబెటిస్ వచ్చే కారకాలు..
* అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడంవలన ఆ రోజంతా నీరసంగా ఉంటారు.
* వీరికి పెద్దయ్యాక డయాబెటిస్ ప్రమాదం ఎక్కువ అవుతుంది.
* PCOS, అధిక రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ స్థాయిలలో మార్పులు
అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గడం వలన ఈ సమస్యను తగ్గించవచ్చు. అలాగే టైప్ -2 డయాబెటిస్ అధిక బరువు ఉన్నావారికి అలాగే తక్కువ బరువు ఉన్నవారికి కూడా వస్తుంది.

Also Read:

cashews benefits: జీడిపప్పును ఎక్కువగా తింటున్నారా? అయితే ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే..