London: రొమ్ముక్యాన్సర్ బాధితులకు రెండున్నర గంటలు పట్టే చికిత్స ఐదు నిమిషాల్లోనే అంటున్న బ్రిటన్ వైద్యులు

|

Apr 06, 2021 | 11:33 AM

ప్రస్తుతం మహిళలను వేధించే పెద్ద సమస్య రొమ్ము క్యాన్సర్. దీనితో బాధ పడేవారు కీమోథెరపీ లాంటి చికిత్స చేయించుకునే సమయంలో చాలా సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది.

London: రొమ్ముక్యాన్సర్ బాధితులకు రెండున్నర గంటలు పట్టే చికిత్స ఐదు నిమిషాల్లోనే అంటున్న బ్రిటన్ వైద్యులు
London
Follow us on

London: ప్రస్తుతం మహిళలను వేధించే పెద్ద సమస్య రొమ్ము క్యాన్సర్. దీనితో బాధ పడేవారు కీమోథెరపీ లాంటి చికిత్స చేయించుకునే సమయంలో చాలా సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. అయితే, బ్రిటన్ లో ఈ సమస్యను అధిగమించడం కోసం కొత్త విధానాన్ని కనుగొన్నారు.

రొమ్ముకేన్సర్ రోగులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా ఉండేందుకు ఈ విధానం దోహదం పడుతుంది. రొమ్ము క్యాన్సర్ బాధితులకు పీహెచ్ ఈ ఎస్ జీ ఓ అనే చికిత్సా విధానాన్ని అందుబాటులోకి తీసుకువాచ్చారు అక్కడి వైద్యులు. దీనివలన కీమోథెరపీ కోసం ఎక్కువ సేపు ఉండాల్సిన అవసరం రాదు.

ఈ విధానంలో మందును ఇంజక్షన్ రూపంలో ఇస్తారు. ఈ ఇంజక్షన్ రెడీ చేయడానికి, బాధితులకు ఇవ్వడానికి కేవలం ఐదు నిమిషాల సమయం సరిపోతుంది. దీంతో రెండున్నర గంటల పాటు ఉండాల్సిన సమయం పూర్తిగా తగ్గిపోతుంది రొమ్ముక్యాన్సర్ బాధితులకు .

చికిత్సా సమయం తగ్గిపోవడంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్యులు. ఈ విధానం వలన ఎక్కువ మందికి వైద్యం అందించే అవకాశం కలుగుతుంది. అంతేకాకుండా రోగులు..వారితో వచ్చిన వారు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేకపోవడంతో కోవిడ్ సోకె ముప్పు చాలా వరకూ తగ్గిపోతుంది.

ఈ ‘పీహెచ్ఈఎస్జీఓ’ విధానంలో పెర్టుజుమాబ్, ట్రస్టుజుమాబ్ అనే ఇంజక్షన్ల మిశ్రమ ఉంటుంది. ‘హెచ్ఈఆర్2 పాజిటివ్’ రొమ్ము క్యాన్సర్ రోగుల్లో అర్హులైన వారికీ ఈ చికిత్స చేస్తారు. ఈ ఇంజక్షన్ ను కీమోథెరపీతో కలిపి లేదా విడిగా ఇవ్వొచ్చని సంబంధిత నిపుణులు చెబుతున్నారు. ఈ చికిత్స కోసం బ్రిటన్ నేషనల్ హెల్త్ సొసైటీ (ఎన్హెచ్ఎస్) సంస్థ రోష్ అనే మెడిసిన్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.

Also Read: Bad Breath: నోటి నుంచి దుర్వాసన వస్తుందా..! నిర్లక్ష్యం వద్దు.. ఇతర సమస్యలకు హెచ్చరిక కావొచ్చు

Liver Diet: లివర్‌ సమస్యలతో బాధపడుతున్నారా..! అయితే ఒక్క వారం రోజులు ఈ ఆహార నియమాలు పాటించండి..