ప్రస్తుత ఆధునిక కాలంలో చాలా మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. ముఖ్యంగా జీవనశైలిలో వస్తున్న మార్పులే ఈవ్యాధికి కారణమని ఎంతో మంది వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆరోగ్యం పట్ల సరైన శ్రద్ధ తీసుకోకపొవడం, తినే ఆహారంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే చిన్న వయసులోనే చాలా మంది మధుమేహం వ్యాధి బారిన పడుతున్నారు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే షుగర్ వ్యాధికి చెక్ పెట్టవచ్చంటున్నారు వైద్య నిపుణులు. వ్యక్తి ఆరోగ్యంగా ఉండేందుకు వాకింగ్ దోహదపడుతుంది. అలాగే వాకింగ్ చేయడం ద్వారా శరీరంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. నడక ద్వారా మధుమేహనికి అడ్డుకట్ట వేయవచ్చని చెబుతున్నారు. వాకింగ్ ద్వారా రక్తంలోని చక్కెరను నియంత్రించడమే కాకుండా మధుమేహం వల్ల వచ్చే ఇతర ఇబ్బందులను కూడా తగ్గిస్తుంది. మధుమేహం ఆకస్మికంగా వచ్చే వ్యాధి కాదు. క్రమంగా ఈ వ్యాధి శరీరంలో పెరుగుతూ ఉంటుంది. డయాబెటిస్ లక్షణాలు కనిపించిన వెంటనే జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది . దీని కోసం ఖరీదైన మందులు తీసుకోవలసిన అవసరం లేదు. రోజువారీ జీవనశైలి, ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మధుమేహాన్ని కంట్రోల్ చేయవచ్చు. తినే ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించవచ్చు. ఉదయం పూట కొన్ని వ్యాయామాలు చేయాలని, అలా చేయడం ద్వారా శరీరంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుందంటున్నారు నిపుణులు. మధుమేహం వ్యాధిని కంట్రోల్ ఉంచడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం.
వాకింగ్ తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయాన్నే వాకింగ్ చేయడం వల్ల శరీరంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. నడక రక్తంలోని చక్కెరను నియంత్రించడమే కాకుండా మధుమేహం వల్ల వచ్చే ఇతర ఇబ్బందులను నివారిస్తుంది. ఇప్పటికే మధుమేహం వ్యాధి ఉన్న వారు రోజు ఉదయం వాకింగ్ చేయడం వల్ల వ్యాధి మరింత ఎక్కువ కాకుండా చూసుకోవచ్చు. ఉదయం పూట కనీసం 20 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే కచ్చితంగా ప్రయోజనం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయాన్నే ఏరోబిక్స్ చేస్తే ఆరోగ్యానికి మంచిది. ప్రతిరోజూ ఉదయం కనీసం 30 నిమిషాలు, వారానికి కనీసం ఐదు రోజులు ఏరోబిక్ డ్యాన్స్ చేస్తే మంచిది. ఇలా చేయడం ద్వారా మధుమేహం ఉన్న వ్యక్తిలో సానుకూల మార్పును చూపుతుంది.
వ్యాయామంలో సైక్లింగ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఉదయం పూట కనీసం 20 నిమిషాల పాటు సైకిల్ తొక్కడం వల్ల చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. అనేక ఇతర రుగ్మతలను కూడా నయం చేస్తుంది.
ప్రతిరోజూ ఉదయం 10 నుంచి 15 నిమిషాలు ప్రాణాయామం, శ్వాస వ్యాయామం చేయడం ద్వారా మధుమేహాన్ని కంట్రోల్ లో ఉంచుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..