Lemon Tea: మనదేశంలో బ్రిటిష్ వారు అడుగు పెట్టిన తర్వాత వచ్చిన అలవాటు టీ. వారు మనదేశాన్ని విడిచి వెళ్లినా.. ఈ టీ తాగే అలవాటు కొనసాగుతూనే ఉంది. ఇక టి లో అనేక రకాలును తయారు చేస్తూనే ఉన్నారు.. పొద్దున్నే టీ తాగితే బద్ధకం తీరుతుంది.. ఉత్సాహంగా అనిపిస్తుంది. అయితే ఈ తేనీరుని సేవించడం వలన కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇక ఈ టి ని ఇండియన్స్ అయితే ఎక్కువగా పాలు వేసుకుని తాగుతారు.. కానీ ఈ టీ .. చాలా రకరకాలుగా తయారు చేసుకోవచ్చు.. లెమన్ టీ, గ్రీన్ టీ, అల్లం టీ, మసాలా టీ, మిర్చి టీ , బాదం టీ ఇలా అనేక రకాలుగా మనం తేనీరు సేవించ వచ్చు.. ఈరోజు లెమన్ టీ తయారీ విధానం .. ఈ టీ తాగడం వల్ల ఉపయోగాలను మనం తెలుసుకొందాం….
ముందుగా నీరు పోసి ఆ నీరు వేడి అయ్యాక తగినంత టీ పొడి వెయ్యాలి.. అలా డికాషన్ తయారీ అయ్యాక.. ఒక గ్లాసులోకి వడకట్టి అందులో నిమ్మరసం, తేనె, కొద్దిగా పుదీనా కలిపితే … మంచి టేస్టీ టేస్టీ లెమన్ టీ రెడీ అవుతుంది.. ఈ టీ వర్షాకాలం ఎంతో మంచి. అయితే పుదీనా ఇష్టం లేనివారు తులసి ఆకులను వేసుకున్నా మంచి రుచికరమైన ఆరోగ్యవంతమైన టీ రెడీ అవుతుంది.
*జలుబు, దగ్గు తగ్గుతుంది
*రోగనిరోధక శక్తి ని పెంచుతుంది.
*శరీరంలో మలినాలు తొలగుతాయి
*మానసిక ఉత్సాహం కలుగుతుంది
*జీర్ణ సమస్య అదుపులో ఉంటుంది
*గుండె సంబంధ సమస్యలు తగ్గుతాయి
*క్యాన్సర్ పై పోరాడుతుంది… ముఖ్యంగా స్కిన్ క్యాన్సర్ నివారణకు బాగా ఉపయోగపడుతుంది
*గొంతు సమస్యలకు ఉపశమనం ఇస్తుంది
*చర్మంలో మొటిమలు, మచ్చలు, వివిధ రకాల డిజార్డర్స్ ను తగ్గిస్తుంది..
*ఈ టీని భోజనానికి ఒక గంట ముందు తీసుకుంటే జీర్ణశక్తి పెరిగి ఆకలి బాగా వేస్తుంది.
*ఈ లెమన్ టీని తీసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు
Also Read: రమ్యకృష్ణ, నదియాల బాటలో మరో హీరోయిన్.. కార్తీ కోసం విలన్ గా నటించనున్న సిమ్రాన్