Left-Handers: ఎడమచేతి వాటం ఉన్నవారు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువ? అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడి

|

Oct 16, 2024 | 4:06 PM

కుడి చేతి వాటం ఉన్నవారి కంటే ఎడమచేతి వాటం ఉన్నవారిలో గుండె, మెదడు వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని జర్నల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. వాస్తవానికి ప్రపంచ జనాభాలో కేవలం 10 శాతం మంది మాత్రమే ఎడమ చేతి వాటం కలిగిన ప్రజలు ఉన్నారు, ఈ పరిశోధనలో వెల్లడైన విషయాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఎడమచేతి వాటం ఉన్నవారికి గుండె, మెదడు వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అధ్యయనం వెల్లడించింది.

Left-Handers: ఎడమచేతి వాటం ఉన్నవారు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువ? అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడి
Left Handers
Image Credit source: unsplash
Follow us on

మనకు రెండు చేతులు ఉన్నాయి. ఒకటి ప్రైమరీ. మరొకటి సెకండరీ. అంటే ఒక చేత్తో మనం ఎక్కువ పని.. ప్రధాన పని చేస్తాము. మరొక చేతిని సహాయం కోసం వంటి సందర్భాల్లో ఉపయోగిస్తాము. జనాభాలో ఎక్కువ మంది కుడి చేతిని ఎక్కువగా.. ఎడమ చేతిని తక్కువగా ఉపయోగిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మొత్తం ప్రపంచంలో కేవలం 10 శాతం మంది మాత్రమే తమ ఎడమ చేతిని రాయడం, తినడం, ఇతర పనులకు ఉపయోగిస్తున్నారు. 90 శాతం మంది కుడిచేతిని ఉపయోగిస్తున్నారు. ఇటీవల ఎడమ చేతి వాటం ఉన్నవారిపై ఓ పరిశోధన జరిగింది. ఈ పరిశోధనలో వీరు అనేక రోగాల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది.

జర్నల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లోని ఒక అధ్యయనంలో ఎడమచేతి వాటం ఉన్నవారిని ఇతరులతో పోలిస్తే కొన్ని ఆరోగ్య సమస్యల ప్రమాదం ఎక్కువగా ఉందని వెల్లడించింది. ఇలా ఎందుకు జరుగుతుందో స్పష్టంగా తెలియనప్పటికీ.. కొన్ని సందర్భాల్లో ఎడమచేతి వాటం ఉన్నవారిలో వ్యాధుల సంభవం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు తమ పరిశోధనలో గుర్తించారు. ఇలా జరగడానికి అనేక అంశాలు కారణం కావచ్చు. అందులో మొదటిది జన్యుపరమైన కారణం అంటే జన్యుపరమైన సమస్య. అంతేకాదు మెదడు కనెక్టివిటీ, పర్యావరణ కారణాలు కూడా దీనికి కారణం కావచ్చు.

రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ

కుడిచేతితో పనిచేసే మహిళల కంటే ఎడమచేతితో పనిచేసే మహిళలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధనలో తేలింది. ప్రెగ్నెన్సీ సమయంలో ఈస్ట్రోజెన్‌కి ఎక్కువగా విడుదల కావడం వల్ల ఎడమచేతి వాటం మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎడమచేతి వాటం ఉన్న మహిళల్లో క్యాన్సర్ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

స్కిజోఫ్రెనియా(మానసిక వ్యాధి)

ఎడమచేతి వాటం ఉన్నవారు స్కిజోఫ్రెనియా (తీవ్రమైన మానసిక అనారోగ్యం)తో బాధపడే అవకాశం ఉందని ఈ అధ్యయనంలో స్పష్టమైంది. 2019, 2022 లతో పాటు 2024లో కూడా దీనిపై అనేక పరిశోధనలు జరిగాయి. స్కిజోఫ్రెనియా ఎడమచేతి వాటం ఉన్నవారిలో ఎక్కువగా ఉండవచ్చని కనుగొనబడింది. అంటే భ్రమలు, భ్రాంతులు, తీవ్రమైన అసాధారణ ఆలోచన, ప్రవర్తనలో మిశ్రమ స్పందన స్కిజోఫ్రెనియా ప్రధాన లక్షణాలు

మానసిక సమస్యలు

వీటితో పాటు ఎడమచేతి వాటం వ్యక్తులలో అనేక మానసిక ఆరోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం కూడా కనుగొనబడింది. కుడిచేతి వాటం వ్యక్తులతో పోల్చితే మానసిక మార్పులు, ఆందోళన, భయము, చిరాకు, విశ్రాంతి లేకపోవడం, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ వంటివి ఎక్కువగా కనిపిస్తాయి. మొత్తానికి ఎడమ చేతి వాటం ఉన్న వ్యక్తుల్లో ఆందోళన సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.

నరాల సంబంధిత రుగ్మతలు

అదేవిధంగా ఎడమచేతి వాటం ఉన్నవారిలో అనేక ఇతర నరాల వ్యాధులు ఎక్కువగా కనిపిస్తాయి. ఇందులో అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్, ఆటిజం, డైస్ప్రాక్సియా ఉన్నాయి. ఈ పరిశోధనలో డైస్లెక్సియాతో బాధపడుతున్న పిల్లలలో ఎడమచేతి వాటం ఉన్న పిల్లలు ఎక్కువగా ఉన్నట్లు ఆధారాలుగా గుర్తించారు.

గుండె జబ్బులు

ఈ పరిశోధన కోసం 18 నుండి 50 సంవత్సరాల వయస్సు గల 379 మంది వ్యక్తులను ఎంచుకున్నారు. వీరిపై అనేక పరిశోధనలు నిర్వహించారు. నిర్వహించిన పరిశోధన ఫలితాలు ఎడమచేతి వాటం ఉన్నవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని చూపిస్తుంది. కుడిచేతితో పనిచేసే వారి కంటే ఎడమచేతితో పనిచేసే వ్యక్తులు సగటున 9 ఏళ్ల ముందే చనిపోతున్నారని కూడా ఒక నివేదిక పేర్కొంది. అయినప్పటికీ ఈ వ్యాధులు, ఎడమచేతి వాటం మధ్య ఎటువంటి ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు పరిశోధకులు కనుగొనలేదు. అయితే ఈ పరిశోధన పలువురుని ఆశ్చర్యం కలిగిస్తోంది.

 

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..