Drinking Water: నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే. వైద్యులు సైతం ఎక్కువ నీరు తాగాలని సిఫారసు చేస్తుంటారు. కానీ, నీరు తడానికి కూడా ఒక సమయం ఉందని మీకు తెలుసా? సరైన సమయంలో నీరు తాగితే అది ఆరోగ్యానికి దివ్య ఔషధంగా పని చేస్తుంది. కానీ, సమయం కాని సమయంలో నీరు తాగితే.. అది హానీకరం అవుతుంది. మరి.. రోజులో ఏ సమయంలో నీరు తాగాలి? ఏ సమయంలో నీరు తాగకూడదు. ఇలాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నిద్రపోయే ముందు ఎక్కువగా నీరు తాగొద్దు..
నిద్రపోయే ముందు ఎక్కువగా నీరు తాగొద్దని చాలా మంది వైద్యులు సూచిస్తున్నారు. దీనికి రెండు కారణాలు చెబుతున్నారు. ఒకటి, మీ నిద్రను ప్రభావితం చేస్తుంది. పడుకునే ముందు అధికంగా నీరు తాగితే మూత్ర విసర్జన కోసం రాత్రి తరచుగా లేవాల్సి ఉంటుంది. తద్వారా నిద్రకు భంగం ఏర్పడుతుంది. రెండవది.. మూత్రపిండాలు రాత్రి సమయంలో నెమ్మదిగా పని చేస్తాయి. దీని కారణంగా రాత్రి ముఖంపై వాపు వంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.
తినడానికి ముందు, తరువాత..
ఆహారం తినడానికి అరగంట ముందు, అరగంట తరువాత నీరు అస్సలు తాగకూడదని చాలా మందికి తెలుసు. ఇలా చేయడం ద్వారా జీర్ణప్రక్రియ సవ్యంగా సాగుతుంది. భోజనం త్వరగా జీర్ణం అవుతుంది. అందుకే.. భోజనం చేసిన అరగంట తరువాత నీరు తాగాలి.
వ్యాయామం చేసే సమయంలో నీరు తాగొద్దు..
వ్యాయామం చేస్తున్న సమయంలో తాగునీటికి దూరంగా ఉండాలని చాలా నివేదికల్లో చెప్పారు. నిజానికి, వ్యాయామం చేస్తున్న సమయంలో శరీర ఉష్ణోగ్రత బాగా పెరుగుతుంది. ఆ సమయంలో నీరు తాగడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. తలనొప్పి వంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే.. వ్యాయామం పూర్తయిన కొంత సమయం తరువాత నీరు తాగాలి.
మూత్రం రంగును బట్టి వాటర్ తాగాలా? వద్దా? తెలుసుకోవచ్చు..
చాలా మంది అవసరానికి మించి ఎక్కువ నీరు తాగుతుంటారు. ఫలితంగా పదే పదే మూత్ర విసర్జనకు వెళ్తుంటారు. అయితే, మూత్రం మంచినీటి రంగులో, తెల్లగా స్పష్టంగా ఉంటే నీరు అధికంగా తాగాల్సిన అవసరం లేదు. ఒకవేళ లేత పసుపు రంగు, పసుపు రంగులో ఉంటే మాత్రం నీరు తాగాలి.
Also read:
Andhra Pradesh: నాలుగేళ్ల క్రితం ప్రాణాలు కోల్పోయిన భర్త.. విగ్రహానికి నిత్యం పూజలు చేస్తున్న మహిళ..
Hyderabad City: హైదరాబాద్ పాతబస్తీలో దారుణం.. చదువు నేర్పుతారని పిల్లలను పంపిస్తే..
Telangana Collectors: తెలంగాణ సర్కార్ కీలక ఉత్తర్వులు.. హైదరాబాద్ కలెక్టర్‌గా ఎల్. శర్మ..