Knuckling Fingers: తరుచుగా వేళ్లను విరుస్తున్నారా.. అయితే, ఈ సమ్యసలు వచ్చే అవకాశం..

|

Apr 04, 2022 | 6:22 PM

తరుచుగా వేళ్లు నొక్కే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది. కొంతమంది అయితే, రోజంతా అనేక సార్లు వేళ్లను విరుస్తుంటారు. ఇలాంటప్పుడు టక్ మనే శబ్దం వస్తుంది. అసలు ఈ శబ్దం ఎందుకు వస్తుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

Knuckling Fingers: తరుచుగా వేళ్లను విరుస్తున్నారా.. అయితే, ఈ సమ్యసలు వచ్చే అవకాశం..
Knuckling Fingers
Follow us on

Knuckling Fingers: తరుచుగా వేళ్లు నొక్కే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది. కొంతమంది అయితే, రోజంతా అనేక సార్లు వేళ్లను విరుస్తుంటారు. ఇలాంటప్పుడు టక్ మనే శబ్దం వస్తుంది. అసలు ఈ శబ్దం ఎందుకు వస్తుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వేళ్లను నొక్కడం వల్ల కీళ్లనొప్పులు కూడా పెరుగుతాయని చాలా మంది నమ్ముతారు. ఇటువంటి పరిస్థితిలో, వేళ్లను నొక్కడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మనం వేలిని నొక్కేందుకు ప్రయత్నించినప్పుడు అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వేలు జాయింట్‌లో జరిగే ప్రక్రియ ఇది. శరీరంలోని అన్ని భాగాల్లోని కీళ్లలో ఇదే పరిస్థితి ఉంటుంది. శరీరంలోని కీళ్లలో ద్రవం ఉంటుంది. అయితే, వేళ్లను ఇలా నొక్కినప్పుడు, కీళ్ల మధ్య ఉన్న ఈ ద్రవం నుంచి వాయువు విడుదల అవుతుంది. దాని లోపల ఏర్పడిన బుడగలు పగిలిపోతాయి. వేళ్లు నొక్కినప్పుడు టక్ మనే శబ్దం రావడానికి ఇదే కారణం. కొన్నిసార్లు జాయింట్స్ వాటంతట అవే శబ్దం చేస్తాయి.

ఎక్కువగా నొక్కితే ప్రమాదం- ఎక్కువ సేపు వేళ్లను నొక్కడం వల్ల చేతి పట్టు బలంపై ప్రభావం చూపి చేతులు వాపు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే వేళ్లను ఎక్కువగా నొక్కకూడదు.

వేలు నొక్కడం వల్ల కీళ్లనొప్పులు వస్తాయని నిపుణులు చెబుతుంటారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలుసుకుందాం. ఎక్కువసార్లు వేళ్లను విరచడం వల్ల కీళ్లనొప్పులు వచ్చే ప్రమాదం ఉందని కొందరు అంటే, అయితే ఇలాంటివి ఏమీ ఉండవని కొందరు చెబుతుంటారు. వీటి వల్ల కీళ్లనొప్పులు వచ్చే ప్రమాదం లేదని ఓ పరిశోధనలో తేలింది.

పదే పదే సౌండ్ వస్తుంటే – పదే పదే జాయింట్ నుంచి సౌండ్ వస్తుంటే వారిలో ఏదో సమస్య ఉండటం లేదా జాయింట్ లూజ్ అవ్వడమే కారణం కావొచ్చు. ఇటువంటి సమయంలో మీరు ఎముకల డాక్టర్‌ను సంప్రదించడం మంచింది. ఈ సమస్య ఎక్కువగా నొప్పితో కూడి ఉంటుంది. మీరు ఎముకల వ్యాధితో బాధపడుతున్నట్లయితే, ఈ విషయాన్ని అస్సలు విస్మరించవద్దు. వెంటనే వైద్యుడిని సంప్రదించండి. లేదంటే తీవ్ర ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది.

Also Read: Health Tips: తలపై దురద భరించలేకపోతున్నారా.. ఈ చిట్కాలతో సింపుల్‌గా వదిలించుకోండి..!

Health Photos: గుండెపోటు నుంచి తప్పించుకోవాలంటే కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!