Dry Eye Syndrome: డ్రై ఐ సిండ్రోమ్ సమస్యకు కారణాలు ఇవేనట.. జాగ్రత్తగా ఉండకుంటే అంతే..

|

Nov 04, 2022 | 6:51 PM

చాలా మందికి కంటి సమస్యలు ఉంటాయి. వాటిలో ప్రధానమైంది.. డ్రై ఐ సిండ్రోమ్. పెరుగుతున్న వయస్సుతో , డ్రై ఐ సిండ్రోమ్ పెరుగుతుంది,

Dry Eye Syndrome: డ్రై ఐ సిండ్రోమ్ సమస్యకు కారణాలు ఇవేనట.. జాగ్రత్తగా ఉండకుంటే అంతే..
Eyes
Follow us on

సర్వేంద్రియానం నయనం ప్రదానం అని అంటుంటారు. మన శరీరంలో అతి ప్రధానమైనవి మన కళ్ళు. ఆ కళ్ళను మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా మందికి కంటి సమస్యలు ఉంటాయి. వాటిలో ప్రధానమైంది.. డ్రై ఐ సిండ్రోమ్. పెరుగుతున్న వయస్సుతో , డ్రై ఐ సిండ్రోమ్ పెరుగుతుంది, కానీ ఈ రోజుల్లో ఈ సమస్య యువతలో కూడా కనిపిస్తుంది. దీని వెనుక చాలా కారణాలు ఉంటాయంటున్నారు నిపుణులు. ఒక వ్యక్తి ఎక్కువసేపు స్క్రీన్‌ను ఉపయోగించినప్పుడు లేదా నిరంతరం కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు, పొడి కళ్ళతో సమస్య వచ్చే అవకాశం ఉంది.

స్క్రీన్ ముందు ఉన్నప్పుడు మనం రెప్పవేయకుండా కొన్ని సెకన్ల పాటు చూస్తుంటాం.. దీని వలన కన్నీళ్లు గాలిలోకి ఆవిరైపోతాయి. అటువంటి పరిస్థితిలో, కళ్ళు పొడిబారడం జరుగుతుంది. అలాగే  అధికంగా ధూమపానం చేయడం కూడా కళ్ళు పొడిబారడానికి కారణమవుతుంది. ధూమపానం వల్ల విష పదార్థాలు కళ్లలోకి చేరుతాయి. ఇది కళ్లను రక్షించే కండ్లకలకను దెబ్బతీస్తుంది అలాగే కళ్ళు పొడిబారడానికి కారణమవుతాయి.

ఇవి కూడా చదవండి

అదేవిధంగా ఎక్కువకాలం కాంటాక్ట్ లెన్స్‌లు ధరించినప్పుడు కూడా కళ్ళు పొడిబారుతుంటాయి. కాంటాక్ట్ లెన్స్‌ కారణంగా కార్నియాకు ఆక్సిజన్ సరఫరా సరిగ్గా జరగదు. అటువంటి పరిస్థితిలో, కళ్ళు పొడిబారడం సమస్య తలెత్తుతుంది. స్త్రీలు మెనోపాజ్‌లో ఉన్నప్పుడు కూడా, వారికి కళ్ళు పొడిబారవచ్చు. మానసిక కల్లోలం , ఒత్తిడి కారణంగా ఈ సమస్య వస్తుందని నిపుణులు అంటున్నారు.