Liquid Diet: మీరు బరువు తగ్గడానికి లిక్విడ్ డైట్ తీసుకుంటున్నారా.. ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోండి..

|

Mar 11, 2022 | 8:22 PM

Weight Loss Tips: బరువు పెరగడం అనేది ఈ మధ్యకాలంలో అన్ని వయసుల వారికి పెద్ద సమస్యగా మారుతోంది. బరువు అదుపులో ఉండేందుకు గంటల తరబడి జిమ్ లో వర్కవుట్ చేసినా..

Liquid Diet: మీరు బరువు తగ్గడానికి లిక్విడ్ డైట్ తీసుకుంటున్నారా.. ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోండి..
Liquid Diet Benefits
Follow us on

బరువు పెరగడం అనేది ఈ మధ్యకాలంలో అన్ని వయసుల వారికి పెద్ద సమస్యగా మారుతోంది. బరువు అదుపులో ఉండేందుకు గంటల తరబడి జిమ్ లో వర్కవుట్ చేసినా.. డైట్ కంట్రోల్(diet control) చేసినా.. బరువు మాత్రం తగ్గడం లేదు. బరువు అదుపులో ఉండేందుకు ఈ రోజుల్లో లిక్విడ్ డైట్‌ను కూడా ఆశ్రయిస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వార్న్(Shane Warne) కూడా బరువు తగ్గేందుకు కోసం లిక్విడ్ డైట్ తీసుకున్నాడు. ఇలా చేయడం వల్లే వార్న్ మృతికి కారణంగా మారి ఉండవచ్చని వైద్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా బరువు వేగంగా పెరగంగా పెరుగుతున్నారు. బరువు పెరగడం వల్ల అనేక వ్యాధులు చుట్టుముడుతుంటాయి. బరువు పెరగడంతో గుండె జబ్బుల వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పెరుగుతున్న బరువును నియంత్రించడం చాలా ముఖ్యం. బరువును నియంత్రించడానికి లిక్విడ్ డైట్ ఉత్తమ ఎంపిక అని చెప్పాలి. లిక్విడ్ డైట్ తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాల విటమిన్లు, మినరల్స్ అందుతాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. దీనిని తీసుకోవడం ద్వారా శరీరం నుంచి టాక్సిన్స్ బయటకు వస్తాయి. అలాగే అనేక తీవ్రమైన వ్యాధులు కూడా చికిత్స లభించినట్లుగా మారుతుంది.

లిక్విడ్ డైట్ ఎలా ఉండాలి: మీరు బరువు తగ్గడానికి లిక్విడ్ డైట్‌ని ఆశ్రయించాలనుకుంటే, మీరు డైట్‌లో జ్యూస్, సూప్, స్మూతీని చేర్చుకోవచ్చు. ఈ ద్రవ ఆహారాలు బరువును నియంత్రిస్తాయి. శరీరం నుంచి విషాన్ని తొలగిస్తాయి. దీన్ని తీసుకోవడం వల్ల బరువు త్వరగా అదుపులో ఉంటుంది. ఈ ఆహారం తీసుకోవడం ద్వారా శరీరానికి ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. దీని కారణంగా జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. తక్కువ కేలరీల ఆహారాలు త్వరగా బరువు తగ్గుతాయి.
మీరు లిక్విడ్ డైట్‌లో కూరగాయల రసాలు, పండ్లు రసాలతోపాటు, పాలను చేర్చవచ్చు.

మీరు లిక్విడ్ డైట్ తీసుకుంటే ఈ విషయాలను గుర్తుంచుకోండి:

  1. మీరు లిక్విడ్ డైట్ తీసుకోవడం మానేస్తే, బరువు వేగంగా పెరగడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే కేలరీలను తగ్గించినప్పుడు.. శక్తిని ఆదా చేయడానికి జీవక్రియ మందగిస్తుంది.
  2. లిక్విడ్ డైట్ అనేది బరువును నియంత్రించడానికి సులభమైన మార్గం కానీ చాలా ప్రభావవంతంగా ఉండదు. ఈ విధంగా మీ ఆహారపు అలవాట్లు ప్రభావితమవుతాయి.
  3. లిక్విడ్ డైట్ వల్ల శరీరంలో అలసట, తల తిరగడం, జుట్టు రాలడం వంటి అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి ముందుగా డాక్టర్ ను సంప్రదించండి.
  4. రెగ్యులర్ వ్యవధిలో ద్రవ పదార్థాలను తీసుకోవడం అవసరం.. లేకపోతే ఆకలి, బలహీనత కూడా పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి: CM Yogi: ఏయ్‌ బిడ్డా.. ఇది యూపీ గడ్డ.. యోగి అడ్డా.. 37 ఏళ్ల చరిత్రను తిరగరాసిన బీజేపీ..

G Kishan Reddy: బీజేపీ గెలుపు వెనుక ఆ తెలుగోడు.. గోవాలో చక్రం తిప్పిన కిషన్ రెడ్డి..